Lokesh Benz Movie: LCU నుండి బిగ్ మూవీ అనౌన్స్‌మెంట్.. మెంటల్ మాస్ కాంబినేషన్!

లొకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి 'బెంజ్' పేరుతో కొత్త సినిమా మే 12న ప్రారంభమైంది. లోకేష్ కథ, నిర్మాణం అందిస్తుండగా, బక్కియరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. రాఘవ లారెన్స్, మాధవన్, నివిన్ పాలీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ 2026లో విడుదల కానుంది.

New Update

Lokesh Benz Movie: టాలీవుడ్‌, కోలీవుడ్‌ ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న లొకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. 'బెంజ్'(Benz) అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం మే 12, 2025 న ప్రారంభోత్సవం జరుపుకుంది. 

ఈ సినిమాకి కథను అందించడమే కాకుండా, నిర్మాతగా కూడా లోకేష్ కనగరాజ్ వ్యవహరిస్తుండడం విశేషం. దర్శకత్వ బాధ్యతలను ‘సుల్తాన్’ ఫేమ్ బక్కియరాజ్ కన్నన్ నిర్వహించనున్నారు. ఈ సినిమా కథలో సస్పెన్స్, యాక్షన్ అదిరిపోతుందని ఇప్పటికే టాక్ వినిపిస్తోంది.

Also Read: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్‌ కూడా మేమే

రాఘవ లారెన్స్ హీరోగా 'బెంజ్'

ఈ చిత్రంలో రాఘవ లారెన్స్(Raghava Lawrence) హీరోగా చేస్తుండగా, మాధవన్, మలయాళ స్టార్ నివిన్ పాలీ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ముగ్గురు  స్టార్ యాక్టర్స్ కలిసి ఒకే చిత్రంలో నటించనుండటంతో, సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?

ఇప్పటికే విడుదలైన ఖైదీ (2019), విక్రమ్ (2022), లియో (2023) వంటి చిత్రాలు లొకేష్ సినిమాటిక్ యూనివర్స్‌ లో మంచి విజయాలను అందుకోగా ఇప్పుడు ‘బెంజ్’ కూడా అదే రేంజ్ లో తెరకెక్కించనున్నారు. అయితే లోకేష్ గత చిత్రాలకి ఈ మూవీ కి కనెక్షన్ కూడా ఉండనున్నట్లు సమాచారం.

Also Read: కాల్పుల విరమణలో వీళ్లే కీలకం.. ఇరు దేశాల DGMO గురించి మీకు తెలుసా?

ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా సాయి అభ్యంకర్ పనిచేయనున్నారు. విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు, కానీ 2026లో ఈ మూవీ విడుదల అయ్యే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా.

Also Read: ఆపరేషన్ సిందూర్‌ను ఆపలేదు.. ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన!


లొకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో రాబోయే అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ ఇదే:

  • కూలీ(2025)
  • ఖైదీ 2– 2025 చివర్లో షూటింగ్ స్టార్ట్ కానుంది.
  • రోలెక్స్ 
  • విక్రమ్ 2
  • లియో 2
  • LCU: చాప్టర్ జీరో – 'ఖైదీ 2'కి ప్రీక్వెల్ షార్ట్ ఫిల్మ్

అయితే ఇప్పుడు కొత్తగా ‘బెంజ్’ మూవీ  ఈ లైనప్‌లో చోటు  దక్కించుకోవడం విశేషం.

Advertisment
తాజా కథనాలు