/rtv/media/media_files/2025/09/11/kantha-release-2025-09-11-18-35-30.jpg)
Kantha Release
Kantha Release: హీరోగా, నిర్మాతగా దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నటిస్తున్న తాజా చిత్రం ‘కాంతా’ (Kaantha Movie) విడుదల వాయిదా పడింది. ముందుగా సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా ఇప్పుడు కొత్త విడుదల తేదీ కోసం ఎదురు చూస్తోంది. ఈ నిర్ణయం వెనుక ప్రత్యేక కారణం ఉంది అదేంటంటే 'లోకా చాప్టర్ 1: చంద్ర'(Lokah Movie) అనే సినిమా భారీ విజయం కావడం.
Also Read: ఓటీటీలోకి 'కూలీ' ఎంట్రీ.. తలైవా వైబ్ అస్సలు మిస్సవకండి!
'లోకా' సినిమా కూడా దుల్కర్ సల్మాన్ నిర్మించిన ప్రాజెక్టే. ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. అదే కారణంగా, దుల్కర్, సహనిర్మాత రానా దగ్గుబాటి కలిసి ‘కాంతా’ను కొన్ని వారాల పాటు వాయిదా వేసే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని వారు తమ అధికారిక ప్రకటనలో తెలియజేశారు.
Also Read: 'రాజా సాబ్' ప్రొడ్యూసర్ క్రేజీ అప్‌డేట్.. రెబల్ ఫ్యాన్స్ కి పండగే..!
#Kantha which was supposed to release on September 12th, is now postponed officially.
— Venkatramanan (@VenkatRamanan_) September 11, 2025
A based on true story film. pic.twitter.com/EGUj8JWr1u
'కాంతా' టీజర్‌కు ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రేమను గుర్తు చేస్తూ మేకర్స్ ఒక మెసేజ్ రిలీజ్ చేశారు. "మీ ప్రేమతో మేము చాలా ఆనందంగా ఉన్నాం. 'లోకా' విజయాన్న ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ‘కాంతా’ విడుదలను వాయిదా వేస్తున్నాం. త్వరలో మీకు 'కాంతా'తో మరో స్పెషల్ అనుభవాన్ని ఇస్తాం" అంటూ తెలిపారు.
Also Read:ఆ రొమాన్స్ ఏంటి బ్రో..! సిద్ధూ 'తెలుసు కదా' టీజర్ వచ్చేసింది
‘కాంతా’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి హైప్ ఉంది. దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి కాంబోలో వస్తున్న ఈ సినిమాకు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. దుల్కర్ సల్మాన్‌తో పాటు సముతిరఖని, భగ్యశ్రీ బోర్స్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. శాస్త్రీయంగా రూపొందిన స్క్రిప్ట్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నాయి.
Also Read:'రాజా సాబ్'పై SKN సాలిడ్ అప్‌డేట్.. ఫ్యాన్స్ గెట్ రెడీ..!
త్వరలోనే కొత్త విడుదల తేదీ.. (Kantha Release Postponed)
ప్రస్తుతం 'లోకా' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతుండగా, ‘కాంతా’ వాయిదా నిర్ణయం కలెక్షన్స్ పరంగాను, ప్రామోషన్ పరంగానూ స్మార్ట్ స్టెప్ అనే చెప్పొచ్చు. ‘కాంతా’ కోసం కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.