Telusu Kada Teaser: సిద్దు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'తెలుసు కదా' మూవీ టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఇద్దరు హీరోయిన్లతో సిద్దూ రొమాన్స్, లవ్ స్టోరీ యూత్ ఆకట్టుకునేలా ఉంది. టీజర్‌లో సిద్ధు స్టైలిష్‌గా, కూల్‌గా కనిపిస్తున్నాడు. 70% ఏంజల్.. 30% డెవిల్ అంటూ టీజర్ సిద్దూ చెప్పిన డైలాగ్ 'డీజే టిల్లు' వైబ్స్ గుర్తుచేస్తున్నాయి.
ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్
రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ఇద్దరూ హీరోను లవ్ చేస్తూ ఉంటారు. మరి హీరో ఎవరిని లవ్ చేశాడు? చివరికి ఎవరితో అతడికి పెళ్లయింది అనే అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇద్దరు హీరోయిన్లతోనూ సిద్దు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. "నాకు రాసిపెట్టి ఉన్న అమ్మాయి తనంతట తానే రావాలి" అంటూ డైలాగ్ చెప్పడం ఆ వెంటనే ఇద్దరు హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడం ఆకట్టుకుంది. తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మూడ్‌కి తగ్గట్టుగా రొమాంటిక్ గా అనిపించింది ప్రేక్షకులకు. మొత్తానికి రొటీన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీలకు భిన్నంగా 'తెలుసు కదా' ఉంటుందని టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది.
Love has never been more confusing and entertaining ❤🔥#TelusuKadaTeaser out now!
— People Media Factory (@peoplemediafcy) September 11, 2025
▶️ https://t.co/eqEteHSSPc#TelusuKada#LoveU2❤🔥
In cinemas worldwide from October 17th!
STAR BOY #SiddhuJonnalagadda@NeerajaKona#RaashiiKhanna@SrinidhiShetty7@MusicThaman… pic.twitter.com/zCVLeKb8G8
ఈ చిత్రంలో కమెడియాన్ వైవా హర్ష కూడా హీరో సిద్దు ఫ్రెండ్ గా ప్రధాన పాత్ర పోషించారు. సిద్ధు - హర్ష మధ్య సంభాషణలు, డైలాగ్స్ అలరించాయి. ఇటీవలే విడుదలైన జాక్ సినిమా ప్లాప్ మూటకట్టుకోవడంతో సిద్దూ ఆశలన్నీ ఈ సినిమా పైనే ఉన్నాయి. టీజర్ చూస్తుంటే.. సిద్దూకు ఈ సినిమా వర్కౌట్ అయ్యేలాగే ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. మల్లిక గంధ సాంగ్ యూట్యూబ్ , సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయ్యింది. యూ ట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది.
ప్రముఖ సెలబ్రేటి స్టైలిస్ట్ నీరజకోన 'తెలుసు కదా' సినిమతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెల 17న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.
కృష్ణ అండ్ హీజ్ లీలా సినిమతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సిద్దూ ఆ తర్వాత 'డీజే టిల్లు' సినిమతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ సినిమతో సిద్దూకి యూత్ లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. టిల్లు పాత్రలో సిద్దూ నటన, ప్రజెంట్ జనరేషన్ తగ్గట్లు డైలాగ్స్ యువతను బాగా ఆకట్టుకున్నాయి. టిల్లు తర్వాత వచ్చిన టిల్లు స్క్వేర్ కూడా సూపర్ హిట్టి అయ్యింది.