Lavanya : పోలీస్ స్టేషన్‌ ముందే చనిపోతా.. నార్సింగి పీఎస్‌ ఎదుట లావణ్య హల్ చల్(వీడియో)

నార్సింగి పోలీస్ స్టేషన్ వద్ద లావణ్య సంచలనం సృష్టించింది. పోలీసులు తనకు న్యాయం చేయడం లేదని.. పోలీస్ స్టేషన్‌ ముందే చనిపోతానని వాపోయింది. నిన్న రాత్రి కూడా కొంతమంది తన ఇంటికి వచ్చి.. తనపై దాడి చేసే ప్రయత్నం చేశారని లావణ్య ఆరోపించింది.

New Update
lavanya narsingh

lavanya narsingh

నార్సింగి పోలీస్ స్టేషన్ వద్ద  హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య సంచలనం సృష్టించింది. పోలీసులు తనకు న్యాయం చేయడం లేదని..   పోలీస్ స్టేషన్‌ ముందే చనిపోతానని వాపోయింది. నిన్న రాత్రి కూడా కొంతమంది తన ఇంటికి వచ్చి.. తనపై దాడి చేసే ప్రయత్నం చేశారని లావణ్య ఆరోపించింది. మొన్న రాజ్ తరుణ్, అతడి తల్లితండ్రుల మీద ఫిర్యాదు చేస్తే.. ఇంతవరకు పోలీసులు వారిపై కేసు పెట్టలేదని మండిపడింది.  పోలీసులు న్యాయం చేయకపోతే స్టేషన్‌లోనో ప్రాణాలు విడుస్తా లావణ్య హెచ్చరించింది.  నాకు ప్రాణహాని ఉందని చెప్పినా పోలీసులు న్యాయం చేయడం లేదని లావణ్య చెబుతోంది.  

Also read :  Hyderabad: నగరంలో భారీ వర్షం.. మరో 2 రోజులు ఇదే పరిస్థితి.. ఆరెంజ్ అలెర్ట్ జారీ!

Also read : Urvashi Rautela: నటి ఊర్వశీపై చర్యలు తీసుకోవాలి.. తీవ్ర స్థాయిలో ఫైరవుతున్న అర్చకులు

 15 మంది లావణ్యపై దాడి

హీరో రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. లావ‌ణ్య ఉంటున్న రాజ్ తరుణ్ ఇంటిని ఆమె వ‌దిలి వెళ్లాల‌ంటూ రాజ్ త‌రుణ్ త‌ల్లిదండ్రులు బుధ‌వారం ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనలో దాదాపుగా 15 మంది తనపై దాడికి దిగారంటూ గురువారం లావ‌ణ్య  నార్సింగి పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్లింది.  కోకాపేటలోని తన ఇంటి వద్ద జరిగిన గొడవపై లావణ్య, నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు 15 మందితో తనపై దాడి చేసి  ఇంటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారని ఆమె ఫిర్యాదులో ఆరోపించింది. తాను అస‌లు రాజ్ త‌రుణ్ తల్లిదండ్రులను ట‌చ్ కూడా చేయాలేదని..  వాళ్లే ఇంట్లోకి వ‌చ్చి వ‌స్తువుల‌ను ధ్వంసం చేశారని ఆరోపించింది. తనను ఈడ్చుకుంటూ వెళ్లి ఇబ్బంది పెట్టారంటూ లావ‌ణ్య వాపోయింది. 

Also read :  Char Dham Yatra: మే 2నకేదార్‌నాథ్ ,4న బద్రీనాథ్ ఆలయాలు ఓపెన్!

Also Read :  Marriage: 60ఏళ్ల వయసులో BJP రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పెళ్లి.. ఆమె మరెవరో కాదు!

 

narsingi Case | Narsingi Police Station

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు