Kurukshetra Web Series: "కురుక్షేత్ర" సిరీస్.. 'మహావతార్‌ నరసింహ’ను మించేలా ప్లాన్..!

నెట్‌ఫ్లిక్స్ తన తొలి పౌరాణిక వెబ్‌సిరీస్‌ "కురుక్షేత్ర"ని అక్టోబర్ 10, 2025న విడుదల చేయబోతోంది. 18 యోధుల దృక్కోణాల్లో 18 ఎపిసోడ్‌లుగా రూపొందిన ఈ సిరీస్‌ను ఉజాన్ గాంగూలీ దర్శకత్వం వహించగా, గుల్జార్ పాటలు రాశారు.

New Update
Kurukshetra Web Series

Kurukshetra Web Series

Kurukshetra Web Series:

భారత పౌరాణిక గాథల్లో మహాభారతంకి ఉన్న స్థానం మాటల్లో చెప్పలేం. ఇది కేవలం కథ కాదు మనందరి జీవితం. ధర్మం, కర్తవ్యము, బంధాలు, బాధ్యత, శాపాలు, పశ్చాత్తాపం ఇవన్నీ కలసిన మహాగాథ. ఇప్పటి వరకూ ఎన్నో రూపాల్లో ఇది కథలుగా, సినిమాలుగా వచ్చాయి. ఇప్పుడు ఈ మహానాటకాన్ని నెట్‌ఫ్లిక్స్(Netflix) మోడరన్ టచ్‌తో "కురుక్షేత్ర" అనే వెబ్‌సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది.

Also Read: 'రాజా సాబ్' ప్రొడ్యూసర్ క్రేజీ అప్‌డేట్.. రెబల్‌ ఫ్యాన్స్‌ కి పండగే..!

ఈ గ్రాండ్ అనిమేటెడ్ సిరీస్‌ను రెండు భాగాలుగా రూపొందించారు. ఒక్కో పార్ట్‌లో 9 ఎపిసోడ్‌లు ఉండనున్నాయి. మొత్తం 18 ఎపిసోడ్‌లతో ఈ మహా సిరీస్ 2025 అక్టోబర్ 10న భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నెట్‌ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తోంది.

ఇది అన్ని సిరీస్ లా కాదు. ఇందులో కథను 18 మంది యోధుల గురించి చూపించనున్నారు. ప్రతి పాత్రకూ ఒక దృక్కోణం, ఒక బాధ, ఒక కర్తవ్యముంది. బ్రదర్స్‌గా మొదలైన బంధం, యుద్ధంలో శత్రువులుగా ఎలా మారిందో... ఈ కథలో మనం చూడబోతున్నాం. ప్రతి పాత్రలోని సంఘర్షణ, వారి నిర్ణయాలు, వాటి ప్రభావం ఇవన్నీ ప్రధాన అంశాలుగా ఉంటాయి.

Also Read:'లిటిల్ హార్ట్స్' నిర్మాత ఎమోషనల్ వీడియో వైరల్..

ఈ సిరీస్‌ను రూపొందించినవారు అను సిక్కా, అలాగే ప్రొడ్యూసర్‌గా అలోక్ జైన్, అజిత్ అంధారే ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను టిప్పింగ్ పాయింట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. దర్శకత్వం ఉజాన్ గాంగూలీ నిర్వహించగా, పాటలకు పదాలను అందించినది సాహితీ దిగ్గజం గుల్జార్.

"కురుక్షేత్ర యుద్ధం అనేది కేవలం బయట జరిగిన యుద్ధం కాదు. అది మనలోని ధర్మం, కర్తవ్య మధ్య జరిగిన అంతరంగిక పోరాటం. ఈ 18 రోజుల కథను ప్రతి యోధుడి చూపులోంచి చూపించేందుకు ప్రయత్నించాం," అంటూ అను సిక్కా వివరించారు.

Also Read: "ఏటిగట్టు" ఆగిందా..? మెగా మేనల్లుడు క్లారిటీ..!

ఈ సిరీస్‌లో నెట్‌ఫ్లిక్స్ అధునాతన విజువల్స్, ఎమోషనల్ నేరేషన్, స్ట్రాంగ్ క్యారెక్టర్ రైటింగ్ వాడుతూ, ప్రాచీన గాథను నేటి తరం ప్రేక్షకులకు అర్థమయ్యేలా రూపొందించారు. ఇది కేవలం పౌరాణిక కథగా కాకుండా, జీవిత పాఠాలుగా భావించవచ్చు.

Also Read: ఫస్ట్ టైమ్.. కొడుకు ఫొటో షేర్ చేసిన వరుణ్ తేజ్.. ఎంత క్యూట్ గా ఉన్నాడో! పిక్స్ చూశారా

"కురుక్షేత్ర" అనేది కేవలం మహాభారతం కథ మాత్రమే కాదు. ఇది ఒక గొప్ప అనుభవం. ప్రతి పాత్రలోని లోతైన భావాల్ని, వారి నిర్ణయాల వెనుక ఉన్న కారణాలను తెలుసుకునే అవకాశం ఇది. నెట్‌ఫ్లిక్స్‌ తన మొదటి మైథలాజికల్ సిరీస్‌గా దీన్ని తీసుకురావడం ఎంతో ప్రత్యేకం. అక్టోబర్ 10 నుంచి ఈ ఎపిక్ యాత్ర మొదలవుతుంది!

Advertisment
తాజా కథనాలు