/rtv/media/media_files/2025/05/29/dzn6GhEPLuD3hd8Oyshc.jpg)
Kriti Sanon as brand ambassador for magic moments
Kriti Sanon: ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్ మ్యాజిక్ మూమెంట్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ ప్రకటనతో ఆమె అభిమానులు, ఫ్యాషన్ లవర్స్ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఆమె గ్లామర్, స్టైల్, యూత్‌ఫుల్ ఎనర్జీ – ఇవన్నీ మ్యాజిక్ మోమెంట్స్ బ్రాండ్ ఇమేజ్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోతాయని అనుకుంటున్నారు.
మ్యాజిక్ మోమెంట్స్ బ్రాండ్
మ్యాజిక్ మోమెంట్స్ అనేది ఒక ప్రముఖ ఆల్కహాలిక్ బ్రాండ్, ముఖ్యంగా యువతలో దీనికి మంచి ఫాలోయింగ్ ఉంది. మోడ్రన్ లైఫ్స్టైల్‌ను ప్రతిబింబించేలా దీని మార్కెటింగ్ ఉంటుంది. ఈ బ్రాండ్ ఇప్పటికే స్టైలిష్, ట్రెండీ ఇమేజ్ కలిగి ఉంది. ఇప్పుడు కృతిని తీసుకోవడం ద్వారా మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంది.
Bringing the vibe, Kriti Sanon joins the Magical Tribe. With the shining queen as our newest Brand Ambassador, we hope to create endless Magic Moments.#MagicMoments #M2 #MagicMomentsMusicStudio #BrandAmbassador #KritiSanon pic.twitter.com/y5lUygApcP
— Radico Khaitan (@radicokhaitan) May 27, 2025
ట్రోలింగ్
ఇదిలా ఉంటే మరోవైపు కృతి మ్యాజిక్ మూమెంట్స్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడంపై విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. సొసైటీలో ఒక స్టార్ హీరోయిన్ ఇమేజ్ ఉన్న కృతి ఇలాంటి ఆల్కహాల్ బ్రాండ్స్ ని ప్రమోట్ చేయడమేంటి అని విమర్శిస్తున్నారు. డబ్బుల కోసం ఇలాంటి పనులు చేస్తారా? అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు ఆదిపురుష్ లో సీత వంటి పౌరాణిక పాత్రను పోషించిన కృతి ఇలాంటి వాటిని ప్రమోట్ చేయడమేంటి అని విమర్శిస్తున్నారు.ఒకప్పుడు పౌరాణిక పాత్రలు తారలు ఎంతో నిష్టగా ఉండేవారని . ఇప్పుడు మాత్రం కాసులకు కక్కుర్తి పడి అలా ఉండటం లేదని మండిపడుతున్నారు.
ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే.. కమర్షియల్ యాడ్స్ లోనూ తన క్రేజ్ ని ప్రదర్శిస్తుంది. ఇటీవలే కృతి గంగూబాయి సినిమాలో మిమీ పాత్రకు నేషనల్ అవార్డు అందుకుంది. దీంతో కృతి ఇమేజ్ దేశవ్యాప్తంగా మరింత పెరిగింది.
Also Read: Viral Video: బురఖా వేసుకున్న మహిళని ఈ నీచుడు ఏం చేశాడో చూడండి! వీడియో వైరల్