/rtv/media/media_files/2025/07/13/kota-srinivasa-rao-died-1-2025-07-13-08-40-26.jpg)
Kota Srinivasa Rao died (1)
తెలుగు సినిమా చరిత్రలో కోట శ్రీనివాస్ రావు- బాబు మోహన్ జంటకు ప్రత్యేక స్థానం ఉంది. వీరిద్దరూ కలిసి తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వడం ఖాయం అనేంతగా అలరించారు. దాదాపు 60 పైగా చిత్రాలలో కలిసి నటించి తమ కామెడీ టైమింగ్, నటనతో మైమరిపించారు. తెరపై నవ్వులు పూయించిన ఈ ఇద్దరు నటులు నిజ జీవితంలోనూ ఎంతో ఆత్మీయంగా మెలిగారు. వారిద్దరి మధ్య సుమారు 10 సంవత్సరాల వయస్సు తేడా ఉన్నా, అది వారి స్నేహానికి అడ్డు రాలేదు. బాబు మోహన్ కోటని సొంత అన్నయ్యలా భావించేవారు. ఈరోజు తన ప్రాణ స్నేహితుడు కోట ఇకలేరని తెలియడంతో బాబు మోహన్ తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. తన స్నేహితుడిని తలుచుకొని కంటతడి పెట్టుకున్నారు.
Also Read:Kota Srinivas Rao: కోట మృతిపై కన్నీళ్లు పెట్టిస్తున్న చిరు, బాలయ్య, ఎన్టీఆర్ ట్వీట్స్ !
ఇద్దరికి ఒకే విషాదం
అయితే తెరపై కలిసి నవ్వులు పంచిన ఈ ఇద్దరు స్నేహితులు.. వ్యక్తిగత జీవితంలోనూ ఒకే రకమైన తీరని విషాదాన్ని చవిచూశారు. వీరిద్దరూ తమ కుమారులను రోడ్డు ప్రమాదాలలో కోల్పోయారు. ఈ సంఘటనలు వారిని మానసికంగా తీవ్రంగా కృంగదీశాయి.
కోట కుమారుడు
జూన్ 21న 2010లో హైదరాబాద్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కోట ఏకైక కుమారుడు కోట వెంకట అంజనేయ ప్రసాద్ ప్రాణాలు కోల్పోయాడు. బైక్‌పై వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదం కోట కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
బాబు మోహన్ కుమారుడు
అలాగే 2003 అక్టోబర్ 13న బాబు మోహన్ కుమారుడు పవన్ కుమార్ కూడా ఒక రోడ్డు ప్రమాదంలోనే మరణించారు. వారిద్దరి జీవితంలో ఈ సంఘటన విధి చేసిన వింతగా అనిపిస్తుంది. కుమారులను కోల్పోయిన బాధ వారిద్దరినీ ఎంతగానో కలిచివేసినప్పటికీ, నటులుగా తమ వృత్తిని కొనసాగించారు.
Also Read: Monica Song: 'మోనికా' పాటలో పూజతో స్టెప్పులేసిన ఈ నటుడు ఎవరు? సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్
Also Read : కూల్ వెదర్‌లో తన అందాలతో హీట్ పెంచుతున్న సాక్షి మాలిక్.. ఫొటోలు చూస్తే పిచ్చెక్కల్సిందే!
cinema-news | kota srinivas rao latest news | babu-mohan