/rtv/media/media_files/2025/03/07/ySjIMAlKJNkqr0W7beaV.jpg)
Dilruba - Official Trailer
Dil Ruba Trailer: కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) 'క' సూపర్ సక్సెస్ తరువాత తన నెక్స్ట్ మూవీ ‘దిల్ రూబా’ (Dil Ruba)ను అనౌన్స్ చేసాడు, దర్శకుడు విశ్వకరుణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ 'దిల్ రుబా'లో హీరోయిన్ గా రుక్సర్ థిల్లాన్ నటిస్తోంది. గుండెలను పిండేసే ప్రేమ కథతో ఒక అందమైన లవ్ స్టోరీ గా ఈ మూవీ రూపొందింది, యూత్ ఆడియన్స్ టార్గెట్ గా తీసిన ఈ 'దిల్ రూబా' మూవీ మార్చి 14న విడుదలకు సిద్ధం అవుతోంది.
Also Read: This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే
లవ్ అండ్ ఎమోషనల్ ‘దిల్ రూబా’
ఈ సందర్భంగా, మూవీ యూనిట్ 'దిల్ రూబా' ట్రైలర్‌ను రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్‌లో కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్ లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ‘‘తప్పు చేసిన తర్వాత చెప్పే సారీకి, అవసరం తీరిపోయిన తర్వాత చెప్పే థాంక్స్‌కి నా దృష్టిలో విలువ లేదు’’ అంటూ కిరణ్ అబ్బవరం చెప్పే డైలాగ్స్ కి యూత్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. కంప్లీట్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. లవ్ తో పాటుగా కిరణ్ అబ్బవరం చేసిన యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి.
Also Read: ముంబైపై గుజరాతీల కుట్ర.. RSS నేతపై దేశద్రోహం కేసు: మాజీ సీఎం సంచలనం!
అంజలి, సిద్ధుల మధ్య జరిగే ఈ ప్రేమ కథ ‘దిల్ రూబా’ ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘‘దిల్ రూబాలో ప్యూర్ లవ్ ఎమోషన్ ఉంటుంది, ప్రేమలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ సినిమాను తప్పక చూడాలి’’ అని అన్నారు. 'దిల్ రూబా' మార్చి 14న థియేటర్లలో సందడి చేయనుంది.