K Ramp: ఆ 10 నిమిషాలు థియేటర్లో రచ్చ రచ్చే..! 'K-Ramp'పై కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కిరణ్ అబ్బవరం 'K-Ramp' అక్టోబర్ 18న విడుదల కానుంది. మొదటి 10 నిమిషాల సెకండ్ హాఫ్‌లో ఫుల్ గా కామెడీ ఉంటుందని కిరణ్ ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు. రొమాన్స్, కామెడీ కలిపిన ఈ చిత్రానికి 'A' సర్టిఫికేట్ లభించింది. దీపావళికి థియేటర్లలో సందడి చేయనుంది.

New Update
K Ramp

K Ramp

K Ramp: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన తాజా సినిమా ‘K-Ramp’ ఈ దీపావళి సందర్బంగా అక్టోబర్ 18, 2025న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై హైప్ పెరిగింది. మొదటిసారిగా దర్శకుడిగా పరిచయం అవుతున్న జైన్స్ నాని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హీరోయిన్‌గా యుక్తి తారేజా నటించగా, ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్ మిక్స్ చేసిన ఫుల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది.

Also Read:రెబల్ స్టార్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. 'పౌర్ణమి' 4K రీ రిలీజ్ బుకింగ్స్ ఓపెన్..!

ఆ సీన్స్ రచ్చెనట..! 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, "సెకండ్ హాఫ్‌లో మొదటి 10 నిమిషాలు ఆడియెన్స్ నవ్వులు ఆపుకోలేరు. హాస్పిటల్ ఎపిసోడ్‌ మొత్తం పక్కా కామెడీతో ఉంటుంది" అని చెప్పారు. తాను చేసిన పాత్ర చాలా ఎనర్జీటిక్‌గా ఉండి, యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకుంటుందని ఆయన అన్నారు.

Also Read: ఎవరి వల్ల కానిది 'బాహుబలి: ది ఎపిక్' రీరిలీజ్ తో జరుగుతోంది.. ఏంటో తెలిస్తే..!

సెన్సార్ షాకింగ్.. ‘A’ సర్టిఫికేట్!

ఇటీవలే సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని ‘A’ సర్టిఫికేట్ పొందింది. ఇది కొద్దిగ ఆశ్చర్యంగా ఉన్నా, సినిమాలో ఫ్యామిలీ అండర్‌టోన్లు కూడా ఉన్నాయని కిరణ్ ముందే చెప్పారు. కానీ సినిమా ఫీల్ గమనిస్తే కొన్ని బోల్డ్ డైలాగ్స్, రొమాంటిక్ సన్నివేశాల వల్లే ఇలా సర్టిఫికేట్ ఇచ్చారని తెలుస్తోంది. 

ఇక రన్‌టైమ్ విషయానికొస్తే, ఈ సినిమాకు 140 నిమిషాల (2 గంటల 20 నిమిషాలు) రన్‌టైమ్ ఉంది. ఇది ఓ లైట్ హార్ట్ కామెడీ ఎంటర్‌టైనర్‌కి పర్ఫెక్ట్ డ్యూరేషన్ అని చెప్పొచ్చు. కథను త్వరగా అర్థం చేసుకునేలా ఉండేలా మేకింగ్ చేసినట్టు తెలుస్తోంది.

Also Read: 'రాజా సాబ్' లేట్ కి బన్నీ సినిమానే కారణం? అసలేం జరిగిందంటే..

ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం, యుక్తి తారేజా జంటగా కనిపించనుండగా, సాయి కుమార్, నరేశ్ విజయకృష్ణ, కామ్నా జెథమలాని, వెన్నెల కిషోర్ వంటి అనుభవజ్ఞులైన నటులు కీలక పాత్రల్లో నటించారు. సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందించగా, రాజేశ్ దండా, శివ బొమ్మక్కు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

దీపావళికి ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నంగా ‘K-Ramp’ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ట్రైలర్, మ్యూజిక్‌తో సినిమాపై హైప్ పెరిగింది. అయితే ‘A’ సర్టిఫికేట్ సినిమా విజయాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తుందో చూడాలి. కానీ కిరణ్ అబ్బవరం ప్రకారం, ఫుల్ ఎంటర్టైనింగ్ ప్యాకేజీగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు