/rtv/media/media_files/2025/08/01/kingdom-day-1-collections-2025-08-01-07-11-08.jpg)
Kingdom First Day Collection
Kingdom First Day Collection: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన ‘కింగ్డమ్’ మూవీ నిన్న (జూలై 31)న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ మూవీకి మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. తొలి రోజు నుంచే ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో కలెక్షన్ల కూడా ఓ రేంజ్‌లో వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి ఇండియాలో అదిరిపోయే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఓవర్సీస్‌లో అంతకుమించిన కలెక్షన్లు సాధించినట్లు సమాచారం.
Also Read: ‘కింగ్డమ్ 2’లో మరొక స్టార్ హీరో.. నిర్మాత నాగవంశీ అఫీషియల్ అప్డేట్
Kingdom Collections
ఈ మూవీ కలెక్షన్లపై తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఇండియాలో తొలి రోజు ‘కింగ్డమ్’ మూవీకి భారీగా కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రూ.7.07 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం షోల ద్వారా ఈ కలెక్షన్స్ వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
ఇక ప్రీ బుకింగ్స్‌లో కూడా ఇది దుమ్ము దులిపేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రీ బుకింగ్స్‌లో రూ.11 కోట్ల నుంచి రూ.12 కోట్ల రేంజ్‌లో ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉందని సమాచారం. ఇది విజయ్ కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్‌గా నిలిచింది.
ఇప్పటి వరకు ‘కింగ్డమ్’ మూవీకి వరల్డ్ వైడ్‌గా రూ.18 కోట్ల నుంచి రూ.20 కోట్ల రేంజ్‌లో షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా మొత్తంగా ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ప్రపంచవ్యాప్తంగా రూ.108 కోట్లకు పైగా వసూలు చేయాల్సిందే.
kingdom Ratings
BookMyShow: ఇక ఈ సినిమాకు BookMyShow ప్లాట్‌ఫారమ్‌లో 14.9K ఓట్ల ఆధారంగా 7.8/10 రేటింగ్ లభించింది. ప్రేక్షకులు ఎక్కువగా విజయ్ నటన, కథనం, అద్భుతమైన దర్శకత్వం గురించి ఇందులో తెలిపారు.
IMDb: IMDbలో ఇంకా ఫిక్స్డ్ రేటింగ్ ఇవ్వలేదు. అయితే కొంతమంది నెటిజన్ల రివ్యూలలో విజయ్ నటన బాగుందని తెలిపారు. కానీ కథనంలో కొంత గ్రిప్ తగ్గిందని వెల్లడించారు.
పలు తెలుగు మీడియా సంస్థలు కింగ్డమ్ సినిమాకు సగటున 3/5 రేటింగ్ ఇచ్చాయి. విజయ్ దేవరకొండలోని నటుడు ఈ సినిమాలో పూర్తిగా పవర్ ఫుల్‌గా కనిపించాడని, భావోద్వేగ సన్నివేశాల్లో చాలా చక్కగా నటించాడని ప్రశంసించారు.
Also Read: విజయ్ ‘కింగ్డమ్’ మూవీపై రష్మిక రివ్యూ.. ఒక్కమాటతో తేల్చేసిందిగా..
Kingdom Budget
విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్‌డమ్’ సినిమా బడ్జెట్ గురించి కూడా ఇప్పుడు ఆశక్తికర చర్చ నడుస్తోంది. ‘కింగ్డమ్’ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇది విజయ్ కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. నిర్మాత నాగవంశీ ఈ సినిమాను దాదాపు రూ.130 కోట్లతో తెరకెక్కించారు.
Kingdom Remunaration
కింగ్డమ్ మూవీలో నటీనటుల పారితోషికం కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రాన్ని మొత్తం రూ.130 కోట్లతో తెరకెక్కించగా.. అందులో విజయ్ దేవరకొండకు దాదాపు రూ.30 కోట్లు, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌కు రూ.10 కోట్లు, దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి రూ.7 కోట్లు ఇచ్చారని సమాచారం.