/rtv/media/media_files/2025/05/10/hlnfBcUAzV195NMxZm9R.jpg)
Ketika Sharma Single Movie
Ketika Sharma: సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లూయెన్సర్ నుండి సినిమా హీరోయిన్ వరకు ఎదిగిన ఢిల్లీ బ్యూటీ కేతికశర్మ మొదట డబుష్మాష్ వీడియోలతో మంచి ఫాలోయింగ్‌తో బాగా పాపులర్ అయ్యింది. తర్వాత డైరెక్టర్ పూరి జగన్నాథ్ దృష్టిలో పడి తన మొదటి సినీ అవకాశం దక్కించుకుంది. పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ సినిమాతో కేతిక టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా ద్వారా గ్లామర్ షోతో గుర్తింపు యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నప్పటికీ, కమర్షియల్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది.
Also Read: Sobhita Dhulipala: ఫైనల్లీ.. ప్రెగ్నెన్సీ పై నోరు విప్పిన అక్కినేని కోడలు.! ఏమన్నారంటే
మొదటి సినిమా ఫ్లాప్ తర్వాత వరుసగా అమ్మడుకి అన్ని ఫ్లాపులే వచ్చాయి. నాగ శౌర్యతో నటించిన ‘లక్ష్య’, వైష్ణవ్ తేజ్‌తో వచ్చిన ‘రంగ రంగ వైభవంగా’ సినిమాలు కూడా అంచనాలను అందుకోలేకపోయాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి సాయి ధరమ్ తేజ్ నటించిన ‘బ్రో’ చిత్రంతో కూడా నటించిన కేతిక కెరీర్ పుంజుకోలేకపోయింది.
అయితే రీసెంట్ గా నితిన్ నటించిన ‘రాబిన్ హుడ్’లో ఒక ఐటమ్ సాంగ్‌లో కనిపించిన కేతిక, తన గ్లామర్‌తో మళ్లీ హాట్ టాపిక్ అయింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫీ చేసిన ఈ పాట,లోని కొన్ని స్టెప్పులు వివాదాలకు కారణమైనా, కేతిక పేరు మాత్రం వార్తల్లో నిలిచింది. అయితే ఇలా ఒక్కోసారి ఐటమ్ నంబర్లతో కనిపిస్తూ ఉండడం వల్ల ఆమె పూర్తి స్థాయి హీరోయిన్‌గా నిలదొక్కుకోలేదన్న విమర్శలు వచ్చాయి. అయితే సోలో హీరోయిన్ గా ఒక్క హిట్ కూడా లేకపోవడం తో కేతిక నిరాశతో హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తోంది.
Also Read: Operation Sindoor: నాన్న జమ్మూలో ఉన్నారు.. రాత్రి ఫోన్ లో ఏమ్మన్నారంటే? సమయ్ రైనా ఎమోషనల్ పోస్ట్
‘సింగిల్'తో హిట్ ట్రాక్..
అయితే నిన్న శుక్రవారం(4-10-2025)న శ్రీ విష్ణుతో(Sri Vishnu) కలిసి నటించిన ‘సింగిల్’ సినిమా(Single Movie) విడుదలై, పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తోంది. ఈ హీట్ సమ్మర్‌లో కూల్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా, కేతికతో పాటు ‘లవ్ టుడే’ ఫేమ్ ఇవానాకూ కూడా మంచి విజయాన్ని అందించింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడం, బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు బాగుండటం వల్ల కేతికకి ఇది ఓ మేజర్ బ్రేక్‌గా మారింది. చూస్తుంటే ఈ ఢిల్లీ బ్యూటీ '#సింగిల్' మూవీ తో మంచి హిట్ ట్రాక్ ఎక్కినట్టే కనిపిస్తోంది.
Also Read: BIG BREAKING: పాక్ ఫైటర్ జెట్ పైలెట్ ను సజీవంగా పట్టుకున్న భారత్
ఇక ఈ విజయంతో కేతిక మరో సినిమా అవకాశాన్ని సొంతం చేసుకుంది. తమిళ డైరెక్టర్ రాజేష్ ఎం. సెల్వ దర్శకత్వంలో ఓ కొత్త ప్రాజెక్ట్‌ను ఒప్పుకుంది. ‘సింగిల్’ తరువాత రాబోతున్న ఈ సినిమా కూడా హిట్ అయితే, కేతిక శర్మ తెలుగులో మరిన్ని అవకాశాలు దక్కించుకోవడం పక్కా..
Also Read: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా
Follow Us