/rtv/media/media_files/2025/05/09/bFZijW1cUDPbTLmvBJeJ.jpg)
Samay Raina comedian youtuber
Operation Sindoor: భారత్ - పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 'ఆపరేషన్ సిందూర్' తర్వాత పాకిస్థాన్ జమ్మూలోని పలు ప్రాంతాలపై దాడులకు తెగబడింది. అలాగే సరిహద్దు రాష్ట్రాలు ఉధంపూర్, సాంబా, జమ్ము, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్‌కోట్ ప్రాంతాల్లో డ్రోన్‌లు, క్షిపణులతో దాడికి పాల్పడింది. కానీ, అప్రమత్తంగా వ్యవహరించిన భారత్ సైన్యం దాడులను తిప్పికొట్టింది. డ్రోన్లు, స్మార్ మిస్సైల్స్ ని గాల్లోనే కూల్చేశాయి. భారత్ - పాక్ యుద్ధం నేపథ్యంలో.. బార్డర్ లో సేవలందిస్తున్న జవాన్ల కుటుంబాలు భయం భయంతో గడుపుతున్నారు.
సమయ్ రైనా ఎమోషనల్ పోస్ట్
తాజాగా బాలీవుడ్ కమెడియన్ సమయ్ రైనా జమ్మూలో విధులు నిర్వహిస్తున్న తన తండ్రి కోసం ఎమోషనల్ అయ్యారు. ఆర్మీలో ఉన్నవారి కుటుంబ సభ్యులు ఈ పరిస్థితుల్లో ప్రశాంత నిద్రపోలేరు. ప్రస్తుతం మా నాన్న జమ్మూలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఫోన్ కోసం నేను కోసం ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటాను. నిన్న రాత్రి జమ్మూ నుంచి నాన్న కాల్ చేశారు.
/rtv/media/media_files/2025/05/09/tWkIXQGRqXl4RCkUqLJO.png)
అక్కడ పరిస్థితులన్నీ అదుపులో ఉన్నాయని తెలిపారు. భయపడకుండా నిద్రపోమని ధైర్యం చెప్పారు. ఆయన ప్రశాంతమైన స్వరం వినగానే నా మనసులో ఉన్న కలవరం అంతా పోయింది. ఆ తర్వాత నా గది కిటీకీలు వేయడానికి వెళ్లగా.. పక్కింటి లైట్లు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. అతని గురించి నాకు తెలియదు.. కానీ అతని కుటుంబ సభ్యులు కూడా ఉన్నారేమో? అతను ఓ జవాన్ కుమారుడేమో? అతనూ ఓ కాల్ కోసం ఎదురు చూస్తున్నాడేమో అనే ఆలోచనలు వచ్చాయి. భారత సైన్యం, వారి కుటుంబాలు చేసే త్యాగాలకు నా హృదయపూర్వక వందనాలు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు సమయ్ రైనా.
telugu-news | indian army operation sindoor | celebrities on operation sindoor samay raina