కోలీవుడ్ స్టార్స్ కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన 'సత్యం సుందరం' మూవీ గత నెల 28 న థియేటర్స్ లో రిలీజై ఫీల్ గుడ్ మూవీ అనిపించుకుంది. తెలుగులో ఎన్టీఆర్ 'దేవర' కు పోటీగా విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సినిమాలో కార్తీ నటనకు ప్రసంశలు దక్కాయి. సినిమాలో చెప్పుకోవడానికి పెద్ద కథేం ఉండదు.
Also Read : 'గేమ్ ఛేంజర్' డ్యూయెట్ సాంగ్ కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా?
కానీ చిన్న అనుభూతుల్ని కూడా ఎంతో అందంగా చూపించిన విధానం, అలానే కుటుంబం, బంధాల్ని ఎష్టాబ్లిష్ చేసిన విధానం కన్నీళ్లు పెట్టిస్తుంది. తమిళ, తెలుగు భాషల్లో రిలీజైన ఈ చిత్రానికి '96' లాంటి కల్ట్ క్లాసిక్ మూవీని తెరకెక్కించిన తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ సినిమాను తీశారు. తమిళంలో మైయళగన్ పేరుతో రిలీజ్ చేశారు. తెలుగు వరకు వచ్చేసరికి టైటిల్ మార్చారు.
Also Read : చంపేస్తామని బెదిరింపులు.. ప్రాణభయంతో సల్మాన్ ఖాన్ ఏం చేశాడో తెలుసా?
తెలుగులో 'దేవర' హడావుడి వల్ల ఈ సినిమా ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు. కానీ చుసిన ఆడియన్స్ మాత్రం మెచ్చుకున్నారు. అలాంటి ఈ ఫీల్ గుడ్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. 'సత్యం సుందరం' మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది.
Also Read : కోలీవుడ్ స్టార్ హీరోను అన్నయ్య అని పిలిచిన సాయి పల్లవి.. బాధపడ్డ హీరో
కాస్త ముందుగానే..
ఒప్పందం ప్రకారం అయితే నెల రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలి. మొదట దీపావళికి స్ట్రీమింగ్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఓ వారం ముందే తీసుకొచ్చే ప్లాన్లో ఉన్నారట. అక్టోబర్ 25 నుంచే 'సత్యం సుందరం' సినిమా తెలుగులోనూ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఫీల్ గుడ్ మూవీస్ ను ఇష్టపడే వారు ఈ సినిమాను ఓటీటీలో అస్సలు మిస్ అవ్వొద్దు.
Also Read : బిగ్బాస్ ఫేమ్, ఆర్జే శేఖర్ బాషా అరెస్ట్?