బిగ్‌బాస్‌ ఫేమ్, ఆర్జే శేఖర్‌ బాషా అరెస్ట్‌?

బిగ్ బాస్ ఫేం, ఆర్జే శేఖర్ బాషా తాజాగా అరెస్ట్ అయ్యాడు. హర్షసాయి బాధితురాలి ఫిర్యాదుతో అతడిపై కేసు నమోదు అయింది. తనపై యూట్యూబ్ ఛానల్స్‌లో నిరాధార ఆరోపణలు చేశాడని ఫిర్యాదు చేయడంతో.. శేఖర్‌బాషాను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

New Update
RJ Shekar Basha

ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వచ్చి పడుతున్నాయి. హర్ష సాయి కేసులో తాజాగా బిగ్ బాస్ ఫేం, ఆర్జే శేఖర్ భాషాని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. హర్ష సాయి బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా శేఖర్ భాషాని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి:  హిందీని రుద్దకండి..మళ్ళీ రాజుకున్న వివాదం..మోదీకి స్టాలిన్ లేఖ

పోలీసుల అదుపులో శేఖర్ భాషా

తనకి సంబంధించిన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నందుకు కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌లో తనపై అసత్య ప్రచారాలు చేసినందుకు ఆ బాధితురాలు శేఖర్ భాషా పై సైబర్ క్రైమ్‌లో కంప్లైంట్ చేసినట్లుగా సమాచారం. దీంతో శేఖర్ బాషాను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Isha ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట

విచారణలో భాగంగా దాదాపు మూడు గంటలుగా సైబర్ క్రైమ్ ఆఫీస్‌లో శేఖర్ భాషాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో బయటకు రానున్నాయి. కాగా హర్ష సాయి మీద హర్ష సాయి హీరోగా నటించిన మెగా సినిమా నిర్మాత, బిగ్ బాస్ ఫేమ్ మిత్ర శర్మ ఇటీవల ఫిర్యాదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇది కూడా చదవండి: షేక్ హసీనాను మోదీ బంగ్లాదేశ్‌కి అప్పగిస్తారా?

తనను హర్ష సాయి రేప్ చేశాడని.. లవ్ చేసుకున్న సమయంలో ప్రైవేట్‌గా దిగిన ఫొటోలు, వీడియోలు చూపించి బెదిరిస్తున్నాడని పలు సెక్షన్ల కింద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హర్ష సాయి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి:  ఫుట్‌పాత్‌ ఆక్రమణలే టార్గెట్.. హైడ్రా నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఇదే!

కానీ హర్ష సాయి ఎక్కడున్నాడన్న విషయాన్ని మాత్రం పోలీసులు ఇంకా కనిపెట్టలేకపోతున్నారు. ప్రస్తుతానికి హర్ష సాయి పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో హర్ష సాయి పలువురు ప్రముఖ యూట్యూబర్లతో కావాలని శర్మ మీద తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడని కూడా ఆరోపణలు వస్తున్నాయి. కాగా ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 8లో అడుగుపెట్టిన ఆర్జే శేఖర్ భాషా.. తన పంచులతో కడుపుబ్బా నవ్వించాడు. కానీ అతి తక్కువ సమయంలోనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు