Kantara 2 Actor: కాంతార' షూటింగ్ లో నటుడి దుర్మరణం!

రిషబ్ శెట్టి 'కాంతార' షూటింగ్ సెట్ లో పెను విషాదం చోటుచేసుకుంది. జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశాత్తు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. మధ్యాహ్నం భోజనం తర్వాత ఈత కోసం నదిలో దూకిన కపిల్ సుడిగుండంలో చిక్కుకొని చనిపోయినట్లు సమాచారం.

New Update

Kantara 2 Actor: కోలీవుడ్ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'కాంతార చాప్టర్ 1'.  అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి  షూటింగ్ సెట్ లో వరుస ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం కొల్లూరు జూనియర్ ఆర్టిస్టుల బస్సు బోల్తా పడిన సంగతి తెలిసిందే. 

షూటింగ్ లో నటుడి మృతి 

అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ లో మరో పెను విషాదం చోటుచేసుకుంది.  మలయాళీ జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ నదిలో మునిగి  ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ఉడిపి జిల్లా కొల్లూరు లో జరిగింది.  అయితే షూటింగ్ పూర్తయిన తర్వాత కపిల్ మధ్యాహ్నం తన టీమ్ తో కలిసి కొల్లూరు లోని సౌపర్ణిక నదికి ఈత కోసం వెళ్ళాడు. ఈ క్రమంలో నదిలోకి  దూకిన కపిల్.. ప్రమాదవశాత్తు  సుడిగుండంలో చిక్కుకొని కొట్టుకుపోయాడు. ఇతర టీమ్ మెట్స్ సహాయంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రెస్క్యూ సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని కనుగొన్నారు. 

Also Read: 2025 Met Gala: మెట్ గాలా ఈవెంట్ లో తళుక్కుమన్న తారలు .. అబ్బురపరిచే ఫ్యాషన్ స్టైల్స్.. ఫొటోలు ఇక్కడ చూడండి

ఇదిలా ఉంటే.. బస్సు బోల్తా పడిన ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగగాపోయినా.. పలువురు ఆర్టిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి. దీనికి ముందు  ఈదురుగాలులు, వర్షాల కారణంగా ఓ సారీ భారీ బడ్జెట్ తో నిర్మించిన సెట్ కూలిపోయింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి ఘటన జరగడం చిత్రబృందాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. 

kantara-chapter-1 | rishab-shetty | junior artist kapil died | Kantara 2 shooting accident 

Also Read: Squid Game 3 trailer: స్క్విడ్ గేమ్ సీజన్ 3 .. చివరి ఆటలో ఫుల్ సస్పెన్స్.. ట్రైలర్ చూశారా?

Advertisment
Advertisment
తాజా కథనాలు