Squid Game 3 trailer ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దక్షిణ కొరియా థ్రిల్లర్ "Squid Game" చివరి సీజన్‌కి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా నెట్ ఫ్లిక్స్ సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది. జూన్ 7 నుంచి ప్రీమియర్ కానున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా సీజన్ 3 ట్రైలర్ విడుదల చేశారు. “The final games begin” అనే ట్యాగ్‌లైన్‌తో ట్రైలర్ షేర్ చేశారు.
It’s time to play the final games 🔴🔵
— Netflix (@netflix) May 5, 2025
Squid Game Season 3 premieres June 27. pic.twitter.com/5ZyZ9HVl2Z
సీజన్ 3 ట్రైలర్
''ఇది చివరి సారి ఆడే సమయం” అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. గత సీజన్లలో ఉన్న ప్లేయర్లు మళ్లీ కనిపించారు. అయితే ట్రైలర్ చివరిలో ఒక బిడ్డ ఏడుపు చివర్లో వినిపిస్తుంది. దీంతో ఓ గర్భిణి కంటెస్టెంట్ ఉండబోతుందా? అని అభిమానుల్లో ఊహాగానాలకు దారితీసింది. అలాగే గంబాల్ మెషిన్ తిరిగి కనిపించింది. సీజన్ 2 ముగిసిన చోట నుంచే కథ కొనసాగుతుంది. గి-హన్ తిరిగి ఆటలోకి అడుగుపెడతాడు. తానూ తిరుగుబాటు చేయడానికి ప్రయత్నించి విఫలమైన తర్వాత ఈ సారి ఆటను శాశ్వతంగా ముగించాలనే ధృడ సంకల్పంతో తిరిగి వస్తాడు.
Squid Game Season 3
Squid Game Season 3 trailer | squid-game | cinema-news | latest-news