Kannappa: కన్నప్ప నుంచి 'మహాదేవ శాస్త్రి' గర్జన.. మోహన్ బాబు ఇంట్రో సాంగ్!

మంచు 'కన్నప్ప' నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేశారు. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు 'మహాదేవ శాస్త్రి' పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ నెల 19న ఆయన బర్త్ డే సందర్భంగా 'మహాదేవ శాస్త్రి' ఇంట్రో సాంగ్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.

New Update

Kannappa: మంచు విష్ణు హీరోగా భారీ అంచనాలతో రూపొందుతున్న మైథలాజికల్ డ్రామా  'కన్నప్ప' ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ చిత్రంలో  మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్‌ కుమార్, ప్రీతి ముకుందన్, మోహన్‌లాల్, ముఖేశ్‌రిషి, కాజల్‌ వంటి స్టార్ కాస్ట్ నటిస్తుండడం మరింత ఆసక్తిని పెంచుతోంది.  రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా కొనసాగిస్తోంది చిత్రబృందం. ఇందులో భాగంగా ఇప్పటికే మూవీ నుంచి రెండు పాటలు విడుదల చేయగా.. తాజాగా మూడో పాట రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 

మహాదేవ శాస్త్రి ఇంట్రో సాంగ్ 

ఈ నెల 19న మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన నటించిన 'మహాదేవ శాస్త్రి' పాత్ర ఇంట్రో సాంగ్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మహాదేవ శాస్త్రి గర్జన ప్రతిధ్వనిస్తోంది.. మహాదేవ శాస్త్రి పరిచయ గీతంలో కోపం, విశ్వాసం ఏకమయ్యాయి. శైవ తుఫానుకు సిద్ధంగా ఉండండి! అంటూ మోహన్ బాబు పోస్టర్ రిలీజ్ చేశారు. 

Also Read: రామరాజ్యం ఆర్మీ పేరుతో అరాచకాలు.. వీరరాఘవరెడ్డి బాగోతం బయటపెట్టిన RTV!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు