Baahubali 3: రాజమౌళి - ప్రభాస్ కాంబోలో వచ్చిన 'బాహుబలి' తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన విషయం తెలిసిందే. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం సౌత్ లో పాన్ ఇండియా ట్రెండ్ ను స్టార్ట్ చేసింది. అలాగే బాక్సాఫీస్ దగ్గర అద్భుత కలెక్షన్స్ సాధించింది. అయితే ఈ సినిమా పార్ట్-3 కోసం సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా కోలీవుడ్ నిర్మాత కేఈ జ్ఞానవేల్ ఓ ఇంటర్వ్యూలో 'బాహుబలి 3' గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Also Read : 'పుష్ప 2' లో 'యానిమల్' విలన్.. సుకుమార్ ఏం ప్లాన్ చేస్తున్నాడో?
తమిళంలో 'బాహుబలి' సినిమాకు ఈయనే నిర్మాతగా వ్యవహరించారు. లేటెస్ట్ గా సూర్యతో 'కంగువ' సినిమాను (Kanguva Movie) నిర్మించారు. ఈ మూవీ కూడా రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే తాజా ఇంటర్వ్యూలో ఆయన ‘కంగువా’ సీక్వెన్స్‌ల మధ్య గ్యాప్‌ను సమర్థిస్తూ ‘బాహుబలి 3’ ప్రస్తావనను తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే 'బాహుబలి' పార్ట్-3 ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.
Also Read : మరోసారి కొండా సురేఖకు సమంత కౌంటర్! ఏమందో తెలిస్తే షాకే
వాటి తర్వాతే 'బాహుబలి' పార్ట్-3..
" గత వారం బాహుబలి మేకర్స్‌తో చర్చించాను. పార్ట్ 3 ప్లాన్ చేసే పనిలో ఉన్నారు. దాని కంటే ముందు రెండు సినిమాలు ఉన్నాయి. వాటి తర్వాతే ‘కల్కి 2’, ‘సలార్ 2’ రిలీజ్ అవుతాయి.." అని చెప్పారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 'బాహుబలి' పార్ట్-3 త్వరలోనే ఉంటుందని నిర్మాత చెప్పడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 'పార్ట్-3' కోసం వెయిటింగ్ అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
Also Read : పుష్ప ఫ్యాన్ కు పూనకాలే.. అప్డేట్ అదిరిపోయింది..
ఇక 'కంగువ' విషయానికొస్తే.. తమిళ దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. ఇందులో సూర్య డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నారు. దిశా పటాని కథానాయిక. బాబీ డియోల్ విలన్ రోల్ చేస్తున్నారు. నవంబర్ 14 న 'కంగువ' పార్ట్ - 1 విడుదల కానుంది.
Also Read : సంక్రాంతి రేసు నుంచి మరో సినిమా అవుట్.. అంతా ఆ నిర్మాత వల్లే..?