Jyothika : 'కంగువా' నిజంగానే బాలేదు.. భర్త సినిమాపై జ్యోతిక రివ్యూ 'కంగువా' చిత్రంపై జ్యోతిక తన రివ్యూ ఇచ్చారు. సూర్య భార్యగా కాకుండా మూవీ లవర్‌గా ఈరివ్యూ ఇస్తున్నట్లు తెలిపారు.'కంగువా' అద్భుత చిత్రం. సూర్య నటన విషయంలో ఎంతో గర్వంగా ఉన్నాను. నిజమే మొదటి అరగంట అనుకున్న స్థాయిలో లేదని అన్నారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 17 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'కంగువా' ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక సినీ క్రిటిక్స్ అయితే ఈ సినిమాకు నెగెటివ్ రివ్యూస్ ఇచ్చారు. సినిమాలో సూర్య యాక్టింగ్ తప్పా ఇంకేం లేదని సినిమా చూసిన ఆడియన్స్ అభిప్రాయపడ్డారు. అనుకున్న స్థాయిలో లేదు.. అయితే తాజాగా ఈ సినిమాపై సూర్య భార్య, హీరోయిన్ జ్యోతిక తన రివ్యూ ఇచ్చారు. సూర్య భార్యగా కాకుండా ఒక మూవీ లవర్‌గా తాను ఈ రివ్యూ ఇస్తున్నట్లు తెలిపారు.' కంగువా.. అద్భుత చిత్రం. సూర్య నటన విషయంలో ఎంతో గర్వంగా ఉన్నాను. నిజమే మొదటి అరగంట అనుకున్న స్థాయిలో లేదు. అలాగే సౌండ్ చాలా ఎక్కువగా ఉంది. ఎన్నో చిత్రాల్లో లోపాలు ఉంటాయి. It looks like Jyothika has skipped Disha Patani scenes in #Kanguva movie. How do I tell her? pic.twitter.com/egqSpM1941 — T H M (@THM_Off) November 17, 2024 Also Read : సుకుమార్ కు షాకిచ్చిన అల్లు అర్జున్.. 'పుష్ప2' విడుదల వేళ ఇలా చేశాడేంటి? రివ్యూలు చూసి ఆశ్చర్యపోయా.. ఇలాంటి ప్రయోగత్మక చిత్రాల్లో అలాంటి చిన్న లోపాలు ఉండటంలో తప్పులేదు. మూడు గంటల సినిమాలో కేవలం తొలి అరగంట మాత్రమే కదా సరిగా లేనిది. నిజం చెబుతున్నా.. ఇదొక అద్భుత సినిమాటిక్ అనుభూతిని అందించింది. ఆయన చిత్రాల్లో ఇలాంటి కెమెరా వర్క్‌ను మునుపెన్నడూ చూడలేదు. ఈ చిత్రానికి వస్తోన్న నెగెటివ్ రివ్యూలు చూసి ఆశ్చర్యపోయా. పాజిటివ్స్ మరిచిపోయారేమో.. గతంలో విడుదలైన భారీ బడ్జెట్ చిత్రాల్లో మహిళలను తక్కువ చేసేలా డైలాగ్స్ ఉన్నా, సన్నివేశాలు బాగోకపోయినా ఇలాంటి రివ్యూలు చూడలేదు. భారీ యాక్షన్ సన్నివేశాలు, సెకండాఫ్‌లో మహిళలపై చిత్రీకరించిన ఫైట్ సీన్స్, కంగువాపై చిన్నారి ప్రేమ గురించి ఎవరూ మాట్లాడటం లేదు. నాకు తెలిసి రివ్యూ చేసే సమయంలో పాజిటివ్స్ మరిచిపోయినట్లు ఉన్నారు. Also Read: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ఇద్దరు స్టార్ సింగర్స్.. ఫొటోలు వైరల్ విడుదలైన తొలి రోజు నుంచే ఇంత నెగెటివిటీని చూడటం బాధగా ఉంది. అద్భుతమైన దృశ్యాన్ని రూపొందించడానికి బృందం ఎంచుకున్న కాన్సెప్ట్, ప్రయత్నానికి తప్పకుండా ప్రశంసలు దక్కాలి..' అని పేర్కొన్నారు. ల ' కంగువా' పై జ్యోతిక ఇచ్చిన రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) #jyothika #kanguva మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి