సుకుమార్ కు షాకిచ్చిన అల్లు అర్జున్.. 'పుష్ప2' విడుదల వేళ ఇలా చేశాడేంటి?

'అన్ స్టాపబుల్' షో లో బాలయ్య... బన్నీని 'పుష్ప 2' తర్వాత మళ్ళీ పార్ట్-3 చేస్తున్నావా? అని అడిగారు. అందుకు బన్నీ..' అమ్మో.. పార్ట్-3 చేయడం నావల్ల కాదు, ఇప్పుడప్పుడే చేయను, పార్ట్-3 చేయడానికి కనీసం ఓ రెండు, మూడేళ్లయినా టైం తీసుకుంటా..' అని అన్నాడు.

New Update
sdfdsg

సుకుమార్ - అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప 2' మూవీ మరో 17 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రోజు ట్రైలర్ రిలీజ్ కూడా ఉంది. దీనికోసం ఫ్యాన్స్ తో పాటూ సినీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే 'పుష్ప 2' రిలీజ్ దగ్గరపడుతున్న టైం అల్లు అర్జున్.. సుకుమార్ కు ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. అదికూడా బాలయ్య 'అన్ స్టాపబుల్' టాక్ షో వేదికగా కావడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

'పుష్ప 2' ప్రమోషన్స్ లో భాగంగా బన్నీ.. ఇటీవల 'అన్ స్టాపబుల్' సీజన్ 4 లో సందడి చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోలు ఇప్పటికే నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ టాక్ షో లో బాలయ్య... బన్నీని 'పుష్ప 2' తర్వాత మళ్ళీ పార్ట్-3 చేస్తున్నావా? అని అడిగారు. 

Also Read: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ఇద్దరు స్టార్ సింగర్స్.. ఫొటోలు వైరల్

పార్ట్-3 నావల్ల కాదు..

అందుకు బన్నీ.. ' అమ్మో.. పార్ట్-3 చేయడం నావల్ల కాదు, ఇప్పుడప్పుడే చేయను, పార్ట్-3 చేయడానికి కనీసం ఓ రెండు, మూడేళ్లయినా టైం తీసుకుంటా..' అని అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్.. 'పుష్ప 2' తర్వాత పార్ట్-3 ఉండదని, నెక్స్ట్ త్రివిక్రమ్ తోనే సినిమా ఉంటుందని వరుస పోస్టులు పెడుతున్నారు. 

కాగా 'పుష్ప' మూవీకి పార్ట్-3 కూడా ఉంటుందని రీసెంట్ గా నిర్మాతలు కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే. 'పుష్ప 2' క్లైమాక్స్ లో పార్ట్-3 కి సంబంధించిన లీడ్ కూడా ఇవ్వనున్నారు. మొత్తం మీద బన్నీ చెప్పినదాన్ని బట్టి చూస్తే 'పుష్ప 3' సెట్స్ పైకి వెళ్ళడానికి కనీసం మూడేళ్లయినా పట్టే ఛాన్స్ ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు