Arjun S/O Vyjayanthi: 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్..!

నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ఏప్రిల్ 18, 2025న విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు, ఇప్పుడు ఈ వార్త అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచింది.

New Update
Arjun S/O Vyjayanthi

Arjun S/O Vyjayanthi

Arjun S/O Vyjayanthi: నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన కొత్త సినిమా అర్జున్ సన్ ఆఫ్ విజయంతి గ్రాండ్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను 2025, ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో 90's అగ్ర హీరోయిన్ గా పేరు పొందిన విజయశాంతి ఓ కీలక పాత్రలో కనిపించనుండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

ఏప్రిల్ 12, 2025న ప్రీ రిలీజ్

తాజాగా ఈ సినిమా పై భారీ అప్డేట్ వచ్చింది. 'మాన్ ఆఫ్ మాసెస్' జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్ర ప్రీ రిలీజ్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ఈవెంట్ ఏప్రిల్ 12, 2025న జరగనుంది. అయితే వేడుక నిర్వహించే ప్రదేశానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుండగా, సోహైల్ ఖాన్, శ్రీకాంత్, బబ్లూ పృథ్వీరాజ్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని అందించగా, అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

కల్యాణ్ రామ్ – జూనియర్ ఎన్టీఆర్ అన్నదమ్ముల మధ్య బంధం మరోసారి ఈ ఈవెంట్ ద్వారా ఫ్యాన్స్‌కు కనుల పండువగా మారనుంది. ఇప్పటికే ఈ వార్త నందమూరి అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు