Devara Japan Release: జపాన్‌లో కూడా మన డామినేషనే.. కిక్కు రా..!!

ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కాంబోలో కొరటాల శివ తెరెకెక్కించిన భారీ పాన్ ఇండియా మూవీ దేవర ఇప్పుడు జపాన్ రెలీజ్ కు సిద్ధమైంది. జపాన్ లో మార్చి 28న దేవర గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ మూవీకి అనిరుద్ అందించిన పాటలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. 

New Update
Devara Japan Release

Devara Japan Release

Devara Japan Release: ఎన్టీఆర్ ( Jr NTR ) హీరోగా, జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్‌గా, 'మిర్చి' దర్శకుడు కొరటాల శివ( Director Koratala Siva) తెరెకెక్కించిన భారీ పాన్ ఇండియా మూవీ దేవర (Devara) 27 సెప్టెంబర్ 2024లో విడుదలై బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది. ఒక్క తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో ఈ మూవీ మంచి క్రేజ్ సంపాదించుకుంది.

Also Read: దెయ్యాలతో చెడుగుడు ఆడేస్తాం.. ఎనీ డౌట్స్..?

సూపర్ హిట్ 'దేవర' ఇప్పుడు జపాన్ మార్కెట్‌లో కూడా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా జపాన్ లో మార్చి 27న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రీమియర్ల ద్వారా ఈ మూవీకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్  వస్తోంది. దేవర జపాన్ క్రేజ్ చూస్తుంటే అక్కడ కూడా భారీ హిట్ సాధించేలా కనిపిస్తోంది. 

Also Read: జోరు పెంచిన 'ది రాజాసాబ్‌'.. టీజర్ లోడింగ్..!

'దేవర 2' పై  ఇంట్రెస్టింగ్ అప్డేట్

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి మ్యూజిక్ పెద్ద ప్లస్ అయ్యింది. అనిరుద్ రవిచందర్ అందించిన పాటలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇక ఈ మూవీకి సీక్వెల్ గా వస్తున్న 'దేవర 2' పై  ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి  త్వరలో మూవీ టీమ్ ప్రకటించనుంది. ఈ ఏడాదిలోనే 'దేవర 2'  ప్రాజెక్ట్‌ పనులు మొదలు పెట్టాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Also Read: నాని 'గే' నా..? టాలెంటెడ్ హీరోని ట్రాన్స్ జెండర్ చేసారు కదరా..!

తెలుగులో దేవరతో సూపర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్, ఇప్పుడు జపాన్ రిలీజ్ తో మరిన్ని రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి మరి.

Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్‌ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు