Janhvi Kapoor : తెలుగు ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్న 'జానూ పాప' వీడియో..!

'దేవర' బ్యూటీ జాన్వీ తెలుగు అభిమానుల కోసం షేర్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతోంది. తనను ఇంతగా అభిమానిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలని.. తనను జానూ పాప అని పిలుస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలని తెలిపింది.

author-image
By Archana
jahnvi

jahnvi Kapoor

New Update

Jahnvi Kapoor : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో నటి జాన్వీ కపూర్  తెలుగు అభిమానులతో  చెప్పాలనుకున్న మాటలను వీడియో ద్వారా  పంచుకున్నారు. తన పై ఇంతగా  అభిమానం చూపిస్తునందుకు ధన్యవాదాలని.. తనను జానూ పాప అని పిలుస్తున్న ఎన్టీఆర్ అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలిపింది. ఈ వీడియోలో జాన్వీ అచ్చ తెలుగు మాట్లాడడం ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. 

జాన్వీ వీడియోలో మాట్లాడుతూ.. 

అందరికీ నమస్కారం.. నన్ను ఇంతలా ఆదరించి నాపై ప్రేమను కురిపిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. నన్ను జానూ పాప అని పిలుస్తున్న NTR అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగు ప్రేక్షకులకు మా అమ్మ ఎంత ముఖ్యమో నాకు తెలుసు. మా అమ్మకు కూడా మీరంతా అంతే ముఖ్యం. 'దేవర' నా తొలి అడుగు.. కొరటాల శివ గారు, ఎన్టీఆర్ సినిమా కోసం నన్ను చూస్ చేసుకోవడం అదృష్టం. మా ప్రయత్నం మీఅందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న తెలుగు అభిమానులందరూ గర్వపడేలా చేస్తాను. అలాగే నాకు సపోర్ట్ చేసిన దేవర టీమ్ అందరికీ ధన్యవాదాలు అని తెలిపారు. 

Also Read :  రైళ్లో టికెట్ లేకుండా ప్రయాణించేవారికి షాక్.. రైల్వేశాఖ కీలక నిర్ణయం

#jr-ntr #tollywood #devara #janhvi-kapoor
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి