Janhvi Kapoor: నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ప్రస్తుతం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. బాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే మంచి పాత్రలను పోషించి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. ఇక టాలీవుడ్ లోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది ఈ ముద్దుగుమ్మ. స్టార్ హీరో ఎన్టీఆర్ సరసన 'దేవర' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటల్లో జాన్వీ.. ఎన్టీఆర్ (NTR) పోటీగా స్టెప్పులేసి ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో జాన్వీ దేవర ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది.
Also Read : దేవర తర్వాత.. ఆ బాలీవుడ్ హీరోతో జాన్వీ నెక్స్ట్ మూవీ..?
''ఆయన సలహా పాటించాను''
ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ తన టాలీవుడ్ ఎంట్రీకి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ ఎంట్రీ విషయంలో కరణ్ జోహార్ సలహా తనకెంతో సహాయపడిందని తెలిపింది. జాన్వీ మాట్లాడుతూ.. "బాలీవుడ్ లో నాకు అవకాశాలు బాగానే ఉన్నాయి. పైగా తక్కువ సమయంలోనే మంచి పాత్రలు పోషించాను. కానీ నేను సౌత్ లో కూడా రాణించాలనేది అమ్మ కోరిక. ఆమె కోరిక తీర్చాలంటే తెలుగులో సినిమాలు చేయాలి. అప్పుడే నాకు సౌత్ నుంచి ఆఫర్లు వచ్చాయి. వాటిలో 'దేవర' తో పాటు తమిళ్ నుంచి ఓ సినిమా వచ్చింది.
ఆ సమయంలో ఏ సినిమా సెలెక్ట్ చేసుకోవాలో తెలియక కన్ఫ్యూజన్ లో ఉండిపోయాను. అప్పుడు కరణ్ జోహార్ తారక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వమని.. ఆటోమేటిక్ గా మంచి అవకాశాలు వస్తాయని సలహా ఇచ్చారు. అలాగే ఆయన సలహా పాటించాను. నిజంగా ఆ సలహా నాకు బాగా కలిసొచ్చింది కూడా. వెంటనే రామ్ చరణ్ తో మరో సినిమా వచ్చింది. ఇంకా కొన్ని సినిమాలకు సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి. అలా కరణ్ మార్గనిర్దేశం నాకు చాలా సహాయపడింది. ఏదేమైనా తెలుగు సినిమాతో ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉందని తెలిపింది."
Also Read : చచ్చినా అలాంటి పాత్రలో నటించను : జాన్వీ కపూర్