78th Cannes Film Festival: బాలీవుడ్ బ్యూటీ నటి జాన్వీ కపూర్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తొలిసారి రెడ్ కార్పెట్ పై మెరిసింది. భారతీయ సంప్రదాయానికి మోడ్రన్ టచ్ ఇస్తూ ప్రత్యేకమైన ఔట్‌ఫిట్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ అందమైన బ్లష్ పింక్ లెహంగాను ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియానీ డిజైన్ చేశారు. కొర్సెట్ టాప్, ప్లీటెడ్ స్కర్ట్ , మ్యాచింగ్ డ్రేప్ ధరించి రాజకుమారిలా మెరిసింది జాన్వీ.
/rtv/media/media_files/2025/05/21/m4N1yHMm0F7MoBYeIub7.jpg)
ప్రపంచ వేదికపై జాన్వీ ధరించిన ఘుంఘట్ (తలపై పట్టు వెయిల్ ఓని ) భారతీయ మూలాలను గుర్తుచేసింది. ఈ అవుట్ ఫిట్ సంప్రదాయం, ఆధునికత కలయికకు అద్భుత ఉదాహరణగా నిలిచింది. జాన్వీతో పాటు "హోంబౌండ్" సినిమా టీమ్ కూడా రెడ్ కార్పెట్ పై మెరిసింది. దర్శకుడు నీరజ్ ఘాయవాన్, నటులు ఇషాన్ ఖట్టర్, విశాల్ జేత్వా, కరణ్ జోహార్ కూడా పాల్గొన్నారు. ఇషాన్ ఖట్టర్ తన కేన్స్ అరంగేట్రం కోసం గౌరవ్ గుప్తా రూపొందించిన ప్రత్యేకమైన రెడ్ వెల్వెట్ డిజైన్‌లో కనిపించాడు. జాన్వీకి రెడ్ కార్పెట్ పై ఇషాన్ సహాయం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.
#JanhviKapoor at the #CannesFilmFestival2025 💕 pic.twitter.com/6Ggut71cOF
— ʙᴇꜱᴛ ᴏꜰ ᴊᴀɴʜᴠɪ (@bestofjanhvi) May 20, 2025
'హోంబౌండ్' కేన్స్ లో ప్రీమియర్
'హోంబౌండ్' అనే సినిమా 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో Un Certain Regard విభాగంలో ప్రీమియర్ అవుతుంది. ఈ ఏడాది భారత్ నుంచి కేన్స్ లో ప్రదర్శితం అవుతున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమా ద్వారా జాన్వీ కపూర్ ప్రపంచ సినిమా ప్రేక్షకులకు తన ప్రతిభను పరిచయం చేస్తోంది. ఆమె బంగారు ఆభరణాలు, ముత్యాల అలంకరణలతో ఉన్న లుక్‌ను అభిమానులు సోషల్ మీడియా లో ప్రశంసిస్తున్నారు.
telugu-news | cinema-news | telugu-cinema-news | jahnvi-kapoor