/rtv/media/media_files/2025/09/17/superman-ott-2025-09-17-10-44-15.jpg)
Superman OTT
Superman OTT: ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ సాధించిన కామిక్ బుక్ సినిమా "సూపర్‌మ్యాన్", థియేటర్లలో ఘన విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలకు సిద్ధమైంది. జేమ్స్ గన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, సెప్టెంబర్ 19న HBO Max లో స్ట్రీమింగ్‌కు రాబోతోంది.
#Superman is available on @StreamOnMax Friday! pic.twitter.com/9B72a84WCM
— James Gunn (@JamesGunn) September 16, 2025
జూలై 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ఓపెనింగ్ వీకెండ్‌లోనే అమెరికాలో $125 మిలియన్ కలెక్ట్ చేసి, మొదటి రెండు వారాల పాటు ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 సినిమాగా నిలిచింది. మొత్తం మీద ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ వద్ద $615 మిలియన్ కలెక్షన్ సాధించింది.
Also Read: 'మార్కో' స్టార్ హీరోగా మోదీ బయోపిక్.. టైటిల్ ఏంటో తెలుసా..?
ఇది ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన కామిక్ బుక్ ఫిల్మ్‌గా నిలిచింది. అయితే, అదే నెల జూలై చివరలో విడుదలైన మార్వెల్ సినిమా “ది ఫాంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్” ఈ రికార్డును కొంతవరకు బ్రేక్ చేసింది.
DC యూనివర్స్‌కు(DC Universe) కొత్త ఆరంభం..
ఈ చిత్రం ద్వారా DC స్టూడియోస్ కి కొత్తదారిని తీసుకువచ్చారు జేమ్స్ గన్, పీటర్ సాఫ్రాన్. గతంలో ఉన్న DC ఎక్స్‌టెండెడ్ యూనివర్స్ (DCEU)కు ఇది ప్రత్యామ్నాయంగా వచ్చిందని చెప్పొచ్చు. గతంలో వచ్చిన మ్యాన్ ఆఫ్ స్టీల్, వండర్ ఉమెన్, జస్టిస్ లీగ్, బ్లాక్ అడామ్, ది సుయిసైడ్ స్క్వాడ్ వంటి చిత్రాలతో కొనసాగిన, 2023లో విడుదలైన అక్వామ్యాన్ అండ్ ది లాస్ట్ కింగ్‌డమ్ తో ముగిసింది.
Also Read: సుధీర్ బాబు 'జటాధర' వచ్చేదప్పుడే ..!
ఇప్పుడు వచ్చిన "సూపర్‌మ్యాన్" చిత్రం ద్వారా కొత్తగా DC యూనివర్స్‌ను తిరిగి ప్రారంభించారు. ఇది ఒక రకంగా DC యూనివర్స్ కి రీసెట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో సూపర్‌మ్యాన్ పాత్రలో డేవిడ్ కొరెన్స్వెట్ నటించారు. ఆయనతో పాటు లోయిస్ లేన్గా రాచెల్ బ్రోస్నాహన్, లెక్స్ లూథర్ నికోలస్ హౌల్ట్, గ్రీన్ లాంతర్ నాథన్ ఫిలియన్, హాట్ గర్ల్ ఇసాబెలా మెర్సెడ్, మిస్టర్ టెరిఫిక్ ఎడీ గాథేగి నటించారు.
Also Read:ప్రభాస్ - ప్రశాంత్ వర్మ బిగ్ సర్ప్రైజ్.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ ఇది..!!
ఇంకా, ఈ సినిమాలో మెటమార్ఫో పాత్రలో ఆంథోనీ కారిగన్, పెరి వైట్గా వెండెల్ పియర్స్, జిమ్మీ ఒల్సెన్గా స్కైలర్ గిసొండో, ఈవ్ టెస్మాకర్గా సారా సాంపాయో, పా కెంట్గా ప్రుయిట్ టేలర్ విన్స్, మా కెంట్గా నెవా హోవెల్, జోర్ ఎల్గా బ్రాడ్లీ కూపర్ కనిపించనున్నారు. ఇందులో మరొక స్పెషల్ క్యారెక్టర్ సూపర్‌మాన్ రోబోట్ పాత్రలో అలెన్ టుడిక్ కనిపిస్తారు. ఈ రోబోకు "గ్యారీ" అనే పేరును పెట్టడం విశేషం. ఇంకా, పాత DCEU నుండి జాన్ సినా పోషించిన పీస్ మేకర్, అలాగే మిల్లీ ఆల్కాక్ నటించిన సూపర్‌గర్ల్ పాత్రలు కూడా ఈ సినిమాలో కనిపించాయి.
Also Read:"మహేష్ బాబును అడగగలరా?" జర్నలిస్ట్‌పై లక్ష్మీ మాంచు ఫైర్..
ఇప్పుడు HBO Max లో
ఇప్పుడు ఈ సినిమా HBO Max లో విడుదల అవ్వడం ద్వారా, DC ఫ్యాన్స్ కి ఓటీటీ లో చూసే అవకాశం దక్కింది. ఇప్పటికే పీంగ్విన్, పీస్ మేకర్ వంటి DC షోలు ఈ ప్లాట్‌ఫామ్‌లో ఉన్నప్పటికీ, “సూపర్‌మ్యాన్” లాంటి భారీ చిత్రం రావడం వల్ల హైప్ మరింత పెరిగింది.
Also Read: రామ్ చరణ్ “పెద్ధి” ఇంట్రెస్టింగ్ అప్డేట్: అమ్మగా ‘అఖండ’ నటి!
జేమ్స్ గన్ దర్శకత్వంలో వచ్చిన ఈ “సూపర్‌మ్యాన్” సినిమా, DC సినిమాటిక్ యూనివర్స్‌కి శుభారంభాన్ని ఇచ్చింది. థియేటర్లలో భారీ విజయం సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీలోనూ అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? అనేది చూడాలి.