Balakrishna: ఫ్యాన్స్ కి కిక్కెకించే న్యూస్.. రజినీ- బాలయ్య ఒకే ఫ్రేమ్ లో!

రజినీ కాంత్ మోస్ట్ అవైటెడ్ 'జైలర్ 2' లో బాలయ్య కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు దీనికోసం కోసం మేకర్స్ బాలయ్యకు భారీ మొత్తంలో చెల్లించినట్లు సమాచారం. పలు నివేదికల ప్రకారం.. ₹ 50కోట్లు తీసుకున్నారని టాక్.

New Update

Jailer 2 Update: నందమూరి బాలయ్య వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. వీరసింహా రెడ్డి, అఖండ, డాకు మహారాజ్ ఇలా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో యంగ్ హీరోలతో పోటీగా దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో బాలయ్య ఫ్యాన్స్ కిక్కెకించే మరో మాస్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ తలైవా, బాలయ్య ఒకే స్క్రీన్ పై సందడి చేయబోతున్నారు. 

జైలర్ 2 లో బాలయ్య

నెల్సన్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న  'జైలర్ 2' లో బాలయ్య ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నెల్సన్  ఈ పాత్రకు సంబంధించిన   స్క్రిప్ట్ బాలయ్యకు వినిపించగా.. అది ఆయన బాగా నచ్చేసి ఒకే కూడా చెప్పారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. అయితే ఈ క్యామియో కోసం బాలయ్యకు భారీ మొత్తంలో చెల్లించారట మేకర్స్. పలు నివేదికల ప్రకారం.. బాలయ్య  20 రోజుల షెడ్యూల్ కోసం   రూ. 50 కోట్లు ఛార్జ్ చేసినట్లు టాక్. దీనికి నిర్మాతలు కూడా ఎటువంటి సంకోచం లేకుండా అంగీకరించారట. 

2023లో వచ్చిన జైలర్ చిత్రంలో భారీ విజయాన్ని సాధించిన 'జైలర్' సీక్వెల్ గా  'జైలర్ 2 ' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సీక్వెల్ లో బాలయ్యతో పాటు శివ రాజ్‌కుమార్ కూడా ఒక అతిధి పాత్రలో తిరిగి వస్తారని టాక్. అయితే  'జైలర్' ఫస్ట్ పార్ట్ లోనే బాలయ్యను తీసుకోవాలని అనుకున్నారట డైరెక్టర్ నెల్సన్.  కానీ ఆయన  పాత్రను సరిగ్గా డిజైన్ చేసి స్క్రిప్ట్ లో అమర్చలేకపోవడంతో కుదరలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

telugu-news | cinema-news | telugu-cinema-news | Jailer 2 Updates | balayya | balayya- Rajinikanth

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు