Hyper Aadi Hari Hara Veera Mallu Review: 'హరిహర వీరమల్లు' పై హైపర్ ఆది షాకింగ్ రివ్యూ.. వీడియో వైరల్

జబర్దస్త్'  హైపర్ ఆది తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమాపై తన రివ్యూ ఇచ్చారు. రివ్యూకు సంబంధించిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. బొమ్మ బ్లాక్ బస్టర్! అందరూ థియేటర్స్ లో చూడండి అని తెలిపారు.

New Update
Hyper Aadi Review on harihara veeramallu

Hyper Aadi Hari Hara Veera Mallu Review

Hyper Aadi Hari Hara Veera Mallu Review: 'జబర్దస్త్'  హైపర్ ఆది(Jabardasth Hyper Aadi) తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) 'హరిహర వీరమల్లు'(Hari Hara Veera Mallu) సినిమాపై తన రివ్యూ ఇచ్చారు. రివ్యూకు సంబంధించిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. బొమ్మ బ్లాక్ బస్టర్! అందరూ థియేటర్స్ లో చూడండి అని తెలిపారు. సినిమా చాలా బాగుంది.. పవన్ ఇంట్రడక్షన్ సీన్( Pawan Kalyan Entry Hari Hara Veera Mallu ) కే మీరు తెచ్చుకున్న పేపర్లు అన్ని అయిపోతాయి. సినిమాలో ఫ్యాన్స్ కి హై ఇచ్చే సీన్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ డిజైన్ చేసిన ఫైట్.. దానికి కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి! అదే హై తో మీరందరూ థియేటర్ నుంచి బయటకు వస్తారు అంటూ  సినిమాపై  ప్రశంసలు కురిపించాడు హైపర్ ఆది. 

నాలుగేళ్ళ తర్వాత

ఇదిలా ఉంటే  దాదాపు నాలుగేళ్ళ తర్వాత పవన్ మళ్ళీ స్క్రీన్ పై కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా సూపర్ గా ఉందంటూ థియేటర్ల ముందు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ లో  మచిలీపట్నం పోర్ట్ ఫైట్, చార్మినార్ చేజ్, కుస్తీ ఫైట్ పవన్ ఫ్యాన్స్ కి కిక్కెకించేలా ఉన్నాయని చెబుతున్నారు. ఇక వీరమల్లుగా పవన్ స్క్రీన్ ప్రజెన్స్ సినిమాకి ప్రాణం పోసిందని అంటున్నారు. 

సన్నివేశాలు పవన్ కళ్యాణ్ నటించిన తొలి పీరియాడిక్ డ్రామా  'హరిహర వీరమల్లు'. అయినప్పటికీ పవన్ వీరమల్లు పాత్రలో ఒదిగిపోయారు. పవన్ కాస్ట్యూమ్స్, లుక్ ఆకట్టుకుంటున్నాయి. డైరెక్టర్  క్రిష్,  జ్యోతికృష్ణ తెరకేకించిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించారు. దాదాపు రూ. 250 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిచినట్లు సమాచారం. 

Also Read: Hari Hara Veera Mallu Review: పవన్ వన్ మ్యాన్ షో.. 'హరిహర వీరమల్లు' ఫుల్ రివ్యూ !

Advertisment
తాజా కథనాలు