/rtv/media/media_files/2025/01/13/SYHOhs90zNrgUlCIN5BH.jpg)
Samarasimha Reddy Photograph: (Samarasimha Reddy)
నందమూరి ఫ్యామిలీలో సీనియర్ ఎన్టీఆర్ తరువాత హీరోగా బాగా క్లిక్ అయిందంటే అది బాలకృష్ణనే. దర్శకుల హీరోగా పేరు తెచ్చుకున్న బాలయ్య అన్ని రకాల పాత్రాలు పోషించి టాప్ హీరోగా ఎదిగారు. అలాంటి బాలకృష్ణ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ రావడం అంటే మాములు విషయమా కాదు కదా.. కానీ అలాంటి ఛాన్ప్ వస్తే హీరోయిన్ రాశి మాత్రం సింపుల్ గా రిజెక్ట్ చేసిందట.
బాలకృష్ణ సూపర్ హిట్ సినిమాలంటే చాలానే ఉన్నాయి. అందులో ఒకటి సమరసింహారెడ్డి. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సిమ్రాన్, అంజలా జవేరీ హీరోయిన్లుగా నటించారు. జయప్రకాశ్ రెడ్డి విలనిజం సినిమాకే హైలెట్ గా నిలిచింది. 1999 జనవరి 13వ తేదీన ఈ మూవీ రిలీజైంది. అంటే నేటితో 26 ఏళ్లు పూర్తి చేసుకుందన్న మాట. ఫ్యాక్షన్ బేస్డ్ కథాంశంతో వచ్చి ఇండస్ట్రీ హిట్ అయిన మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం.
#26YearsForSamarasimhaReddy
— MovieBuzz (@MoviesUpdatez) January 13, 2025
Hyd,Sudarshan70 176 days Run.
Closing gross 72,86,361#NandamuriBalakrishna@SimranbaggaOffc#AnjalaZaveri@GkParuchuri
A Film By #BGopal#SamaraSimhaReddypic.twitter.com/ttrrc18prV
సిందూరపువ్వు నుంచి మెయిన్ లైన్
కథ విషయంలో ఎక్కడా కూడా రాజీపడలేదు దర్శకుడు గోపాల్. రచయితలు పరుచూరి సోదరులు దాదాపు 25 నుండి 30 కథలు చెప్పిన రిజెక్ట్ చేశారు. ఫైనల్ గా రాజమౌళి తండ్రి విజేయంద్రప్రసాద్ రాసిన ఓ కథను ఓకే చేశారు అదే సమరసింహారెడ్డి. తమిళ చిత్రం సిందూరపువ్వు నుంచి మెయిన్ లైన్ తీసుకుని సమరసింహారెడ్డి కథగా మార్చారు విజేయంద్రప్రసాద్ . మరో రచయిత రత్నం సూచన మేరకు కథను రాయలసీమ బ్యాక్ డ్రాప్ కు షిప్ట్ చేశారు. కథ అంతా అయిపోయాక టైటిల్ కోసం చాలా పేర్లు అనుకున్నారు. నరసింహాం అనే టైటిల్ కు అందరూ ఓటు వేయగా ... పరుచూరి గోపాలకృష్ణ మాత్రం సమరసింహారెడ్డిగా మార్చగా అందరూ క్లాప్స్ కొట్టారు.
ఇక క్యాస్టింగ్ మొదలైంది. ముందుగా సంఘవి, రాశి, అంజలా జవేరీలను హీరోయిన్లుగా అనుకున్నారు. అయితే సినిమాలో సీతాకోకచిలుకతో బొడ్డు సీన్ ఉండటంతో రాశి ఫస్ట్ నరేషన్ లోనే సినిమాను రిజెక్ట్ చేశారు. దీంతో ఆమె ప్లేస్ లో సిమ్రాన్ ని తీసుకువచ్చారు. దాదాపు ఆరు కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.16 కోట్లు కొల్లగొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం మూడు థియేటర్లలో 227 రోజులు ఆడగా.. 29 కేంద్రాలలో 175 రోజులు, 122 కేంద్రాలలో 50 రోజులు ప్రదర్శించబడింది. ఈ సినిమాకు గానూ ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు గోపాల్. ఈ సినిమాను రాశి చేసుంటే మాత్రం ఆమె సినీ గ్రాఫ్ ఇంకో లెవల్ లోఉండేది అనడంలో సందేహం అక్కర్లేదు. ఏదైనా రాసిపెట్టి ఉండాలి కదా..!
Also Read : బాలయ్య ఫ్యాన్స్కు బిగ్ షాక్.. ఆన్లైన్ లో డాకు మహారాజ్ HD ప్రింట్