Miss World 2025: భారత్- పాకిస్థాన్ వార్ ఎఫెక్ట్.. మిస్‌ వరల్డ్‌2025 పోటీలు రద్దు?

భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో అందాల పోటీల నిర్వహణపై సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే అందాల పోటీలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో విశ్వహిందూ పరిషత్ పోటీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది.

New Update

Miss World 2025: అంతర్జాతీయ ఈవెంట్ మిస్ వరల్డ్ 2025 అందాల  పోటీలు ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యము వహిస్తోంది. మే 10 నుంచి 31వరకు హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ పోటీలకు ప్రభుత్వం ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసింది. 120కి పైగా దేశాల అందగత్తెలు, ప్రతినిధులు, స్పాన్సర్స్ ఈ ఈవెంట్ లో పాల్గొననున్నారు. ఇప్పటికే పలు దేశాల అందాల భామలు హైదరాబాద్ చేరుకున్నారు. రేపు గచ్చిబౌలి స్టేడియంలో ఈవెంట్ ప్రారంభోత్సవం జరగనుంది. 

 మిస్‌ వరల్డ్‌2025 పోటీలు రద్దు.?

ఈ క్రమంలో అందాల పోటీల నిర్వహణ పై సస్పెన్స్ నెలకొంది. పాకిస్థాన్- భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపధ్య్మలో పోటీలను నిర్వహించాలా..వద్దా అనే ఆలోచనలో పడింది రాష్ట్ర ప్రభుత్వం. ఈమేరకు మరికాసేపట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. హైదరాబాద్ లోని చారిత్రాత్మక కట్టడాలు, పబ్లిక్ ప్లేసెస్, సామాన్య ప్రజల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మూడు వారాల పాటు జరగబోయే అందాల పోటీలకు పూర్తి స్థాయి భద్ర కల్పించడం పెద్ద సవాలే. దీంతో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సైతం అందాల పోటీలు కొనసాగిస్తే తలెత్తే సమస్యల గురించి ఆలోచిస్తోంది. ఈ విషయంపై ఎప్పటికప్పుడు రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు విశ్వహిందూ పరిషత్ తెలంగాణలో అందాల పోటీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. యుద్ధం నేపథ్యంలో పోటీలు ఎలా జరుపుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

విమానాల ఎఫెక్ట్ 

ఇదిలా ఉంటే మిస్ వరల్డ్ పోటీలకు మొత్తం 116 దేశాల నుంచి అందాల భామలు రావాల్సి  ఉండగా.. మే 8వరకు 109 మంది వచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. కొంతమంది మోడల్స్, స్పాన్సర్లు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు ఇంకా రావాల్సి ఉంది. కానీ..యుద్ధం నేపథ్యంలో  హఠాత్తుగా విమానాల రూట్స్, సర్వీసులు రద్దు కావడం .. అందాల పోటీల పై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అంటున్నారు. 

telugu-news | cinema-news | film-news | miss world 2025 entry pass | Miss World 2025 hyderabad | Ind-Pak War Live Updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు