Hrudayapoorvam OTT: రూ.100 కోట్ల హిట్ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్.. ఎక్కడంటే..?

రూ.100 కోట్ల కలెక్షన్స్ తో సూపర్ హిట్ కొట్టిన మోహన్‌లాల్ 'హృదయపూర్వం' సినిమా ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఓన్‌లైన్‌లో తెలుగు సహా ఐదు భాషల్లో అందుబాటులో ఉంది.

New Update
Hrudayapoorvam OTT

Hrudayapoorvam OTT

Hrudayapoorvam OTT:

ఈ ఓనంని పురస్కరించుకొని థియేటర్లలోకి వచ్చిన మలయాళ సినిమాల్లో 'హృదయపూర్వం' ఒకటి. ఈ చిత్రం ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో(Jio Hotstar) స్ట్రీమింగ్‌కి అందుబాటులో ఉంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఇప్పుడు ఆన్‌లైన్‌లో చూసేయొచ్చు.

Also Read :  ఏం ఫీలుంది మామ! జోగిపేట్ శ్రీకాంత్ ఈజ్ బ్యాక్ .. ఈ సంక్రాంతికి పండగే

'హృదయపూర్వం' సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించాడు. ఆయన "సందీప్ బాలకృష్ణన్" అనే పాత్రను పోషించాడు. ఇతను కొచ్చిలో ఉన్న ఓ సక్సెస్ ఫుల్ క్లౌడ్-కిచెన్ బిజినెస్‌ను నడిపించే 40 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తాడు. డబ్బు ఉన్నా, జీవితంలో ఒంటరితనం వెంటాడుతూ, గుండె మార్పిడి కోసం ఎదురు చూస్తుంటాడు.

గుండె మార్పిడి జరిగిన తర్వాత కూడా, "గుండె అనేది కేవలం ఒక అవయవం మాత్రమే" అంటూ భావించే సందీప్ దృష్టికోణం పూర్తిగా మారుతుంది. తన గుండె దాత కుమార్తె నిశ్చితార్థానికి పుణెకు వెళ్లినప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతాయి. అతని ఊహించని ప్రవర్తన కుటుంబ సభ్యులను కలవరపెడుతుంది. ఈ పరిణామాలతో కుటుంబంలో ఉద్రిక్తతలు పెరిగి, అనేక భావోద్వేగాల నడుమ కథ సాగుతుంది.

ఈ చిత్రంలో మాలవికా మోహనన్(Malavika Mohanan) కథానాయికగా నటించగా, సంగీత్ ప్రతాప్, సంగీత మాధవన్ నాయర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించారు. సత్యం సినిమాస్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. థియేటర్లలో భారీ కలెక్షన్లు సాధించి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. మీరు థియేటర్లలో మిస్ అయితే, ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో చూడవచ్చు!

Advertisment
తాజా కథనాలు