Kamal Haasan: కమల్.. తగ్గాల్సిందే! స్టార్ హీరోకు హైకోర్టు షాక్

కన్నడ భాష వివాదంలో కమల్ హాసన్ కి కర్ణాటక హైకోర్టు షాకిచ్చింది. ''ఎలాంటి ఆధారాలతో కన్నడ భాష గురించి ఆ వ్యాఖ్యలు చేశారు.. మీరేం చరిత్రకారుడా అని ప్రశ్నించింది. ఒక్క క్షమాపణ చెబితే సమస్య మొత్తం పరిష్కారం అవుతుందని న్యాయస్థానం తెలిపింది.''

New Update

Kamal Haasan: కన్నడ భాష వివాదం విషయంలో కమల్ క్షమాపణలు చెప్పకపోతే.. కర్ణాటకలో ఆయన  'థగ్‌ లైఫ్‌’ సినిమా విడుదలను అడ్డుకుంటామని KFCC (కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ) హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలో కమల్ తన చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేసేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయాలని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం  షాకిచ్చింది. ''ఎలాంటి ఆధారాలతో కన్నడ భాష గురించి ఆ వ్యాఖ్యలు  చేశారు..  మీరేం చరిత్రకారుడా అని  ప్రశ్నించింది. ఒక్క క్షమాపణ చెబితే సమస్య మొత్తం పరిష్కారం అవుతుందని న్యాయస్థానం తెలిపింది.'' 

 హైకోర్టు షాక్

''మీరు కమల్ హాసన్ కావచ్చు లేదా ఇంకెవరైనా కావచ్చు. కానీ ప్రజలు మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదు. ఒక ప్రజాప్రతినిధిగా అలాంటి ప్రకటనలు చేయకూడదు. మీ వ్యాఖ్యల కారణంగా అక్కడ అశాంతి ఏర్పడింది. కన్నడ ప్రజలు మిమల్ని క్షమాపణలు మాత్రమే అడిగారు. మీరు ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారు? మీరేం చరిత్రకారుడా లేక భాషావేత్తనా? ఎందుకు అలాంటి కామెంట్స్ చేశారు అని న్యాయస్థానం ప్రశ్నించింది. క్షమాపణ చెబితే సమస్య మొత్తం పరిష్కారం అవుతుందని న్యాయస్థానం తెలిపింది.'' 

కమల్ చేసిన వ్యాఖ్యలేంటి 

అయితే ఇటీవలే థగ్ లైఫ్ ఆడియో రిలీజ్ లో పాల్గొన్న కమల్ హాసన్ తమిళ భాష నుంచి కన్నడ భాష పుట్టిందని అన్నారు. ఈ వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదంగా మారాయి. కన్నడిగుల మనోభావాలు దెబ్బతీసేలా కమల్ వ్యాఖ్యలు ఉన్నాయని పలువురు రాజకీయ నాయకులు, నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేశారు. దీంతో కమల్ హాసన్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని లేదంటే కర్ణాటకలో ఆయన చిత్రాన్ని బ్యాన్ చేస్తామని నిరసనలు తెలుపుతున్నారు. 

Also Read: Kamal Haasan: ‘థగ్‌ లైఫ్‌’ రిలీజ్ చేయండి.. కర్ణాటక హైకోర్టుకు కమల్ హాసన్!

Advertisment
తాజా కథనాలు