బాలనటిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోయిన్‌గా నిలిచిన రాశి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అగ్రనటుల సరసన రాశి నటించారు. కెరీర్ దూసుకెళ్తున్న సమయంలోనే డైరెక్టర్‌ను పెళ్లి చేసుకుని వెండి తెరకు దూరమయ్యారు. అయితే ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు రాశి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తనకు ఎదురైన కష్టాలను షేర్ చేస్తూ రాశి ఎమోషనల్ అయ్యారు. పశ్చిమ గోదావరికి చెందిన రాశి బాలనటిగా రావు గారి ఇల్లు, బాల గోపాలుడు, చెట్టు కింద ప్లీడర్, ఆదిత్య 369 , పల్నాటి పౌరుషం సినిమాల్లో నటించారు. తమిళంలో ప్రియం చిత్రం ద్వారా హీరోయిన్‌గా రాశి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పెళ్లిపందిరి, గోకులంలో సీత, శుభాకాంక్షలు , పండుగ, డాడి డాడీ, స్వప్నలోకం, హరిశ్చంద్ర, కృష్ణబాబు, సముద్రం, ప్రేయసి రావె, పోస్ట్‌మన్, మూడు ముక్కలాట వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా ప్రేక్షకులను అలరించారు.
ఇది కూడా చూడండి: OG America Bookings: OG మేనియా..! పవర్ స్టార్ ధాటికి షేక్ అవుతున్న అమెరికా బుకింగ్స్..
వీడే, వెంకీ వంటి సినిమాల్లో ఐటెం సాంగ్స్ కూడా రాశి చేశారు. కెరీర్ బాగానే ఉన్న సమయంలో పెళ్లి చేసుకున్నారు. దాదాపుగా పదేళ్ల తర్వాత రాశికి పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, తల్లి పాత్రలు చేస్తున్నారు. అలాగే బుల్లితెరపై కూడా అలరిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్‌తో గోకులంలో సీత మూవీలో రాశి హీరోయిన్‌గా నటించారు. మళ్లీ సెకండ్ పార్ట్ ఉంటే నటిస్తానని తెలిపారు. అలాగే తన కూతురిని సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే.. శ్రీకాంత్ కుమారుడు రోషన్‌తో చేయిస్తానని ఆమె అన్నారు. టాలీవుడ్‌లో తనకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని, తనతో సినిమా చేయడానికి కూడా రెడీగా ఉన్నట్లు వెల్లడించారు. అలాగే చిరంజీవితో సినిమా చేయాలని ఉందన్నారు.
ఆ డైరెక్టర్ వల్ల నా జీవితం నాశనం
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రాశి ఎమోషనల్ అయ్యారు. ఓ డైరెక్టర్ వల్ల తన జీవితం నాశనం అయ్యిందన్నారు. తాను మగరాయుడిలా ఉండాలని, లుక్ మారాలని ఓ డైరెక్టర్ ట్రైనర్‌ను పెట్టి వెయిట్ లాస్ చేయించారని ఆమె అన్నారు. ఫస్ట్ డే షూటింగ్‌లోనే చేయకూడని సీన్ పెట్టాడని, డైరెక్టర్‌గా అతన్ని మరిచిపోతానని ఆమె తెలిపారు. ఆ డైరెక్టర్ వల్ల సినిమాలో కొన్ని సన్నివేశాలు చూసి ఆడియన్స్ బాగా డిస్పాయింట్ అయ్యారని ఆమె అన్నారు. ఈ సినిమా వల్లే తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఆమె తెలిపారు. ఒక ఆడపిల్ల ఉసురు పోసుకోకూడదన్నారు. రాశి ఇంట్లో వారు కూడా తన విషయంలో ఇలానే చెప్పేవారని ఆమె అన్నారు. అయితే రాశి పుట్టిన రోజు నాడే రాశి వాళ్ల నాన్న చనిపోయినట్లు ఆమె తెలిపారు. స్క్రీన్‌పైన తనని హీరోయిన్‌గా చూసి సంతృప్తిగా వెళ్లిపోయారని ఆమె తెలిపిన ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ అవుతోంది.
ఇది కూడా చూడండి: Beauty Movie: ''OG''కి ఎదురెళ్తున్న.. ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్న: హీరో అంకిత్ కొయ్య
Heroine Rasi: ఆ డైరెక్టర్ వల్లే నా జీవితం నాశనం.. హీరోయిన్ రాశి షాకింగ్ కామెంట్స్!
బాలనటిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోయిన్‌గా నిలిచిన రాశి ఓ మీడియా ఛానెల్‌కు ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో రాశి ఎమోషనల్ అయ్యారు. ఓ డైరెక్టర్ వల్ల తన జీవితం నాశనం అయ్యిందని, తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఆమె ఆవేదన చెందారు.
Herione Rasi