Laila Twitter Review: విశ్వక్ సేన్ లైలా ట్విట్టర్ రివ్యూ .. దీనికంటే వరుణ్ తేజ్ మట్కా బెటర్ అంట!

విడుదలకు ముందే రాజకీయ విభేదాలతో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిన విశ్వక్ సేన్ లైలా మూవీ ప్రీమియర్ షోలు ఆమెరికాలో మొదలయ్యాయి. సినిమాను చూసిన అభిమానులు ఎక్స్ వేదికగా సినిమా ఎలా ఉందో ట్వీట్స్ చేస్తున్నారు. మూవీ పూర్తిగా నిరాశపరిచిందని అంటున్నారు.

New Update
laila review

laila review

Laila Twitter Review: విశ్వక్ సేన్(Viswak Sen), ఆకాంక్ష శర్మ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన  మూవీ లైలా(Laila Movie Review).  సినీ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై యువ నిర్మాత సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. ప్రేమికుల దినోత్సవం సందర్బంగా భారీ అంచనాలతో ఈ మూవీ రిలీజ్ అయింది. విడుదలకు ముందే రాజకీయ విభేదాలతో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిన ఈ మూవీ ప్రీమియర్ షోలు ఆమెరికాలో మొదలయ్యాయి. సినిమాను చూసిన అభిమానులు ఎక్స్ వేదికగా సినిమా ఎలా ఉందో ట్వీట్స్ చేస్తున్నారు.  

Also Read: యూట్యూబర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పార్లమెంటరీ ప్యానెల్ కీలక నిర్ణయం

సినిమా అంతా విశ్వక్ సేన్ వన్ మ్యాన్ షో అని అంటున్నారు. లేడీ గేటప్ లో అదరగొట్టాడని ట్వీట్స్ చేస్తున్నారు. అయితే స్టోరీ పరమ రోటీన్ గా ఉండటం, ఇంట్రెస్టింగ్ సీన్స్ లేకపోవడం పెద్ద మైనస్ అంటున్నారు.  విశ్వక్ సేన్ తప్ప సినిమాలో చెప్పుకోవడానికి, చూడడానికి ఏమి లేదని చెబుతున్నారు.  మ్యూజిక్ సో.. సో గా ఉందని చెబుతున్నారు.  విశ్వక్ సేన్ కష్టం వృథా అయిందని..  లేడి గెటప్ లో  మాత్రం  పర్ఫెక్ట్ గా ఉన్నాడని కితాబు ఇస్తున్నారు.  ఈ సినిమా కంటే వరుణ్ తేజ్ మట్కా సినిమా వందరేట్లు బెటర్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.  

Also Read:  ‘నాన్న క్షమించండి.. మీ కలల్ని నెరవేర్చలేకపోయా’: జేఈఈ విద్యార్థిని సూసైడ్‌!

Also Read: కంగనా రనౌత్‌కు అభినందనలు చెప్పిన కాంగ్రెస్‌.. ఎందుకంటే ?

పాత తరం కథ, అర్థంలేని హాస్యం

లేడీ గెటప్ వేసి క్యారెక్టర్ చేయడానికి గట్స్ కావాలని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.  ఇక నటీనటుల కూడా తమ పాత్రలకు తగ్గట్టు నటించడంలో ఫెయిల్ అయ్యారట. ఫస్టాఫ్ దారుణంగా ఉందంటే సెకండాఫ్ అంతకు మించి ఉందని ట్వీట్స్ చేస్తున్నారు. పాత తరం కథ, అర్థంలేని హాస్యం, ఆకర్షణ లేని సినిమాగా లైలా నిరాశపరిచిందని చెబుతున్నారు.   మొత్తానికి ఈ సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి అయితే ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ అయితే రాలేదని చెప్పాలి.. లేడీ గెటప్ తో కొత్తగా అయితే ట్రై చేశాడు  కానీ కథలో దమ్ము లేదన్న  కామెంట్స్  ఎక్కువగా వినిపిస్తున్నాయి. 

Also Read :  AP: వల్లభనేని వంశీ, మరో ఇద్దరికి 14 రోజుల రిమాండ్...

Advertisment
తాజా కథనాలు