NTR: బామ్మర్ది పెళ్ళిలో ఎన్టీయార్ హడావుడి..వీడియోలు వైరల్

 ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీయార్ కాస్త సెలవు తీసుకున్నారు. తన బామ్మర్తి నార్నె నితిన్ వివాహంలో అన్నీ తానై దగ్గరుండి చూసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. 

New Update
ntr

నార్నె నితిన్...ఇతను కూడా సినిమా హీరోనే. ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి బ్రదర్ నార్నె నితిన్ హీరోగా వచ్చిన మ్యాడ్, ఆయ్, మ్యాడ్ 2 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాయి. తాజాగా ఈరోజు  శివానికి మూడు ముళ్లు వేసిన నితిన్.. ఓ ఇంటివాడయ్యాడు.గతేడాది నిశ్చితార్థం చేసుకున్న వీరిద్దరూ ఈరోజు మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. హీరో దగ్గుబాటి వెంకటేష్ ఫ్యామిలీకి బంధువులు అయిన తాళ్లూరి వెంకట కృష్ణ ప్రసాద్, స్వరూప కూతురు అయిన శివాని తాళ్లూరిని ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ పెళ్లి చేసుకున్నాడు. 

స్పెషల్ అట్రాక్షన్ తారక్..

ఇక ఈ పెళ్ళిలో వధూవరుల తర్వాత బావగారు ఎన్టీయార్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకున్న తారక్..హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లిలో ఘనంగా జరిగిన పెళ్ళిలో సందడి చేశాడు. అన్నీ తానై దగ్గరుండి వివాహాన్ని జరిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

Advertisment
తాజా కథనాలు