Laila Movie Controversy: ఎవడ్రా బాయ్‌కాట్‌ చేసేది.. విశ్వక్ సేన్ కు మద్దతుగా రంగంలోకి బాలయ్య ఫ్యాన్స్!

విశ్వక్‌  సేన్ లైలా సినిమాకు మద్దతుగా నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో #WesupportLaila అంటూ ట్రెండ్ చేస్తున్నారు. మూవీ బాగుంటే ఎవరూ ఆపలేరని, ఒక నటుడు చేసిన వ్యాఖ్యలతో సినిమాను బాయ్‌కాట్ చేయడం కరెక్ట్ కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

New Update
balakrishna fans

balakrishna fans

Laila Movie Controversy: టాలీవుడ్ నటుడు పృథ్వీ (Comedian Prudhvi) చేసిన వ్యాఖ్యలతో దూమారం రేపడంతో బాయ్‌కాట్ లైలా(Boycott Laila) అంటూ వైసీపీ(YCP) శ్రేణులు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.  దీనిపై హీరో విశ్వక్‌ సేన్(Viswaksen) వివరణ ఇచ్చుకున్నప్పటికీ వాళ్లు మాత్రం వెనక్కితగ్గలేదు. ఈక్రమంలో లైలా సినిమాకు మద్దతుగా నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో #WesupportLaila అంటూ ట్రెండ్ చేస్తున్నారు. మూవీ బాగుంటే ఎవరూ ఆపలేరని, ఒక నటుడు చేసిన వ్యాఖ్యలతో సినిమాను బాయ్‌కాట్ చేయడం కరెక్ట్ కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.  అనుకున్న టైమ్ కు రిలీజ్ చేద్దాం.. మనల్ని ఎవడాపుతాడో చూద్దాం అంటూ బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు రామ్‌ నారాయణ్‌ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ చేయనున్నారు.  

Also Read: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే

ఇక లైలా ఈవెంట్‌లో పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. వ్యక్తిగతమైన పొలిటికల్‌ స్టేట్‌మెంట్స్‌ను తాము ప్రోత్సహించం. సినిమాపైనే మీరు దృష్టిపెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.  

 

జోకులు వేసే ఆర్టిస్టులకు మాత్రమే

మరోవైపు విశ్వక్‌సేన్ లైలా సినిమాకి తాము వ్యతిరేకం కాదని మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి తెలిపారు. తమపై జోకులు వేసే ఆర్టిస్టులకు మాత్రమే తాము వ్యతిరేకమని తెలిపారు. వైసీపీపై జోకులు వేసే ఆర్టిస్ట్ నటించే ప్రతి సినిమాని బాయ్‌కాట్ చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టికెట్ కొనుక్కొని మరీ మా మీద మీతో జోకులు వేయించుకొనేంత పిచ్చి గొర్రెలం మాత్రం కాదంటూ ఆమె ట్వీట్ చేశారు. పృథ్వీకి ఏ సినిమాలో అవకాశం ఇచ్చినా, ఏ సినిమా ఫంక్షన్‌కు అతణ్ని పిలిచినా ఆ సినిమాను బాయ్‌కాట్ చేస్తామని వైసీపీ అధికార ప్రతినిధి వెంకట రెడ్డి కారుమూరు అన్నారు. అలానే ఆ నిర్మాత, ఆ హీరోల అన్ని మూవీలను పద్ధతి ప్రకారం బాయ్‌కాట్ చేస్తామని హెచ్చరించారు. 

Also Read  : మోదీ విదేశీ పర్యటనకు ఉగ్ర బెదిరింపులు.. ముంబై పోలీసులు అలెర్ట్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు