Harsha: మా మావయ్య తప్పిపోయారు.. ప్లీజ్, వెతికిపెట్టండి.. కమెడియన్ హర్ష ఎమోషనల్ వీడియో

కమెడియన్ వైవా హర్ష ఇన్‌స్టాగ్రామ్‌ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో తన 91 ఏళ్ల అంకుల్‌ తప్పిపోయారని, ఆయన్ను వెతికేందుకు సహాయం చేయాలని కోరాడు. ఆయన చివరగా ఉన్న లొకేషన్ కు సంబంధించి ఫుటేజ్ ను పంచుకున్నాడు. ఆయన కనిపిస్తే కాల్ చేయమని నంబర్స్ కూడా ఇచ్చాడు.

New Update
viva harsha

viva harsha

సినీ నటుడు, కమెడియన్ వైవా హర్ష ఇన్‌స్టాగ్రామ్‌లో తన కామెడీ వీడియోలు, సినిమా అప్‌డేట్స్‌ షేర్ చేస్తూ ఉండడం తెలిసిందే. యూట్యూబర్‌గా కెరీర్ స్టార్ చేసిన హర్ష, తన టాలెంట్ తో కొద్ది కాలంలోనే టాప్‌ స్టార్‌ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలను పోషించే స్థాయికి ఎదిగారు. పలు సినిమాల్లో లీడ్ రోల్స్ కూడా చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 6.5 లక్షల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు.

అయితే ఈసారి హర్ష తన సోషల్ మీడియా వేదికగా సీరియస్ విషయాన్ని పంచుకున్నారు. తన 91 ఏళ్ల అంకుల్‌ ఏ. పాపారావు తప్పిపోయారని,ఆయన్ను వెతికేందుకు సహాయం చేయాలని కోరుతూ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో హర్ష.. " నేను మీ అందరిని ఒక సహాయం అడగడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఏదైనా సమస్య మన చుట్టు పక్కల వాళ్లకు జరిగితే ఒకలా ఉంటుంది, మన వరకు వస్తే అది ఒకలా ఉంటుంది. 

Also Read : 'రాజాసాబ్' పై అంచనాలు పెట్టుకోకుండా ఉంటే బెటర్.. థమన్ షాకింగ్ కామెంట్స్

ఇప్పుడు అలాంటి ఒక పరిస్థితిలో నేను, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నాము. మా అంకుల్‌ ఏ. పాపారావు, అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారు. నాలుగు రోజుల క్రితం వైజాగ్‌లోని ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చివరిసారిగా కంచరపాలెం ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్‌లో ఆయన కనిపించారు. ఆయన చాలా నీరసంగా ఉన్నారు. 

నా రిక్వెస్ట్‌ ఏమిటంటే, మీలో ఎవరైనా ఆయనను చూసినట్లయితే ముందుగా కాస్త ఫుడ్‌ ఇవ్వండి. ఆపై, వీడియోలో ఇచ్చిన నెంబర్లకు కాల్ చేసి సమాచారం ఇవ్వండి.." అని అభ్యర్థించారు. హర్ష షేర్ చేసిన వీడియోలో వాళ్ళ అంకుల్ పాపారావు రోడ్లపై నడుచుకుంటూ ఉన్న దృశ్యాలు ఉన్నాయి. 

Also Read : 'పుష్ప' చీటింగ్.. మూవీ టీమ్ పై నెటిజన్స్ ఫైర్

ఆయన శారీరకంగా బలహీనంగా కనిపిస్తున్నారు. కనీసం నడవలేని పరిస్థితిలో కనిపిస్తున్నారు. ప్రస్తుతం హర్ష షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాములుగా సామాన్య కుటుంబాల్లో ఇలాంటి మిస్సింగ్ కేసులను మనం చూస్తుంటాం. కానీ హర్ష లాంటి సెలబ్రెటీ ఫ్యామిలీలోనే ఒక పర్సన్ మిస్ అవ్వడం గమనార్హం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tamannaah Bhatia: రెడ్‌ డ్రెస్‌లో వయ్యారాల వంపులో మిల్క్ బ్యూటీ.. ఫొటోలు చూశారా?

టాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియా వయ్యారాల ఒలికిస్తూ రెడ్‌ డ్రెస్‌లో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. రెడ్ డ్రెస్‌లో హాట్ లుక్స్‌లో సూపర్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

New Update
Advertisment
Advertisment
Advertisment