Harsha: మా మావయ్య తప్పిపోయారు.. ప్లీజ్, వెతికిపెట్టండి.. కమెడియన్ హర్ష ఎమోషనల్ వీడియో
కమెడియన్ వైవా హర్ష ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో తన 91 ఏళ్ల అంకుల్ తప్పిపోయారని, ఆయన్ను వెతికేందుకు సహాయం చేయాలని కోరాడు. ఆయన చివరగా ఉన్న లొకేషన్ కు సంబంధించి ఫుటేజ్ ను పంచుకున్నాడు. ఆయన కనిపిస్తే కాల్ చేయమని నంబర్స్ కూడా ఇచ్చాడు.