/rtv/media/media_files/2025/02/25/yzLb7xJWvRh8RtyU5riD.jpg)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా నుంచి నిన్న రిలీజైన ‘కొల్లగొట్టినాదిరో' సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ షేక్ చేస్తోంది. 24 గంటల్లో వరల్డ్ వైడ్ గా అత్యధిక వ్యూస్ వచ్చిన వీడియోగా ఈ సాంగ్ నిలిచింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ఎక్స్ వేదికగా ప్రకటించారు.
#HariHaraVeeraMallu's second single ~ #Kollagottinadhiro has taken YouTube by storm, becoming the 𝐌𝐎𝐒𝐓 𝐕𝐈𝐄𝐖𝐄𝐃 video 𝐖𝐎𝐑𝐋𝐃𝐖𝐈𝐃𝐄 in the past 24 hours. 🤩🔥#HHVM 2nd single 𝐓𝐑𝐄𝐍𝐃𝐈𝐍𝐆 𝐓𝐎𝐏 on #YouTube - https://t.co/Zs1CXHQMWT
— Mega Surya Production (@MegaSuryaProd) February 25, 2025
A @mmkeeravaani Musical 🎹 pic.twitter.com/uN5cNCCnDF
జ్యోతి కృష్ణ, క్రిష్ సంయుక్తంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని 2025 మార్చి 28న రిలీజ్ చేయనున్నారు. కొల్లగొట్టినాదిరో పాటకు ఆస్కార్ విజేత చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. మంగ్లీ ఆలపించారు. ఈ పాటలో యాంకర్ అనసూయ స్పెషల్ అపియరెన్స్ గా కనిపించబోతుంది. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
రెండు భాగాలుగా హరిహర వీరమల్లు
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది. దాదాపు రెండేళ్ల క్రితం అనౌన్స్ చేసిన ఈ భారీ యాక్షన్ డ్రామా షూటింగ్ ముగింపుకి దశకు చేరుకుంది. పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగుతో పాటుగా తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. ఈ చిత్రాన్ని 17వ శతాబ్దంలో సాగే నేపథ్యంలో తెరకెక్కుస్తుండగా.. పవన్ కెరీర్‌లో ఇదే మొదటి ప్యాన్ ఇండియా మూవీ.
Also Read : 'సంక్రాంతికి వస్తున్నాం' ఫ్యాన్స్ కి అనిల్ రావిపూడి మరో బంపర్ సర్‌ప్రైజ్