MY MODI STORY: మోదీకి అదిరిపోయే బర్త్‌డే విషెస్.. పవన్, చిరు, మహేష్, ఎన్టీఆర్ ఏమన్నారంటే..?

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 75వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈరోజు మోదీ పుట్టినరోజు సందర్భంగా సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పలువురు టాలీవుడ్ ప్రముఖులు,హీరోలు కూడా మోదీకి విషెష్ తెలిపారు. 

New Update
Happy Birthday Modiji

Happy Birthday Modiji

MY MODI STORY: భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 75వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈరోజు మోదీ పుట్టినరోజు సందర్భంగా సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పలువురు టాలీవుడ్ ప్రముఖులు,హీరోలు కూడా మోదీకి విషెష్ తెలిపారు.  #MYMODI STORY అనే హ్యాష్ ట్యాగ్ తో బర్త్ డే విషెష్ పంచుకున్నారు. సెలబ్రెటీల బర్త్ డే విషెస్ ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.. 

Also Read: ప్రభాస్ - ప్రశాంత్ వర్మ బిగ్ సర్ప్రైజ్.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ ఇది..!!

మోదీకి హీరోల విషెష్.. 

అక్కినేని నాగార్జున మోదీకి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ 2014 లో ఆయనను మొదటిసారి కలిసిన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. మోదీజీ ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి! ఆయన వ్యక్తిగత జీవితం, కుటుంబాన్ని పక్కన పెట్టి దేశం కోసం జీవితాన్ని అంకితం చేశారు. ఆయన ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాల అంటూ బర్త్ డే విషెస్ తెలిపారు. 

Happy Birthday Modiji

గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం, ఆనందంతో ఉండాలి.  మీ నాయకత్వంతో ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. 

Also Read: రామ్ చరణ్ “పెద్ధి” ఇంట్రెస్టింగ్ అప్డేట్: అమ్మగా ‘అఖండ’ నటి!

Modi At 75

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి కూడా ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 75 ఏళ్ల వయసులో కూడా 50 ఏళ్ల వ్యక్తిలా ఎంతో చురుకుగా కనిపిస్తారని, ఆయన ఎంతో మందికి స్ఫూర్తి అని అన్నారు. ఆయన నిర్ణయాలతో ప్రపంచం ముందు భారత్  తలెత్తుకునేలా చేశారని కొనియాడారు.

Also Read: సుధీర్ బాబు 'జటాధర' వచ్చేదప్పుడే ..!

మెగాస్టార్ చిరంజీవి మోదీకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకంక్షాలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. దేశాన్ని ఉన్నత శిఖరాలకు నడిపించడానికి ఆయనకు మంచి ఆరోగ్యం, బలం, జ్ఞానం ఉండాలని కోరుకుంటున్నాను అని రాసుకొచ్చారు.

ఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవన్ కళ్యాణ్  ఒక సుదీర్ఘ వీడియో ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీ క్రమశిక్షణ, నిబద్ధత దేశానికి మార్గదర్శకమని ప్రశంసించారు. దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసం, ఐక్యతను పెంపొందించడంలో మోదీజీ  కృషి ఎంతో గొప్పదని కొనియాడారు.

గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ మోదీజీకి  75వ పుట్టినరోజు శుభాకాంక్షలు!  దేశానికి సేవ చేయడంలో మీకు ఆరోగ్యం, బలం, నిరంతర విజయం ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ విషెష్ తెలిపారు హీరో రామ్ చరణ్. 

Also Read:Manchu Manoj: తమ్ముడూ.. నీకు విలన్ గా నటిస్తా..! 'లిటిల్ హార్ట్స్' మౌళికి మనోజ్ బంపరాఫర్

Advertisment
తాజా కథనాలు