'హనుమాన్' డైరెక్టర్ షాకింగ్ డెసిషన్.. డైరెక్షన్ మానేసి ఆపని చేసుకుంటా అంటూ?

'దేవకీ నందన వాసుదేవ' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రశాంత్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.' నాకు కథలు రాయడం అంటే ఇష్టం. నాకు ఏ డైరెక్టర్స్ అయినా ఛాన్స్ ఇస్తే హ్యాపీగా డైరెక్షన్ ఆపేసి కథలు రాసుకుంటూ కూర్చుంటాను. ఏ డైరెక్టర్ అడిగినా కథలు ఇస్తాను..' అని అన్నారు.

New Update
prasanth varma

హనుమాన్' మూవీతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ మూవీతో 'PVCU' పేరుతో ఓ సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేశాడు. ఈ యూనివర్స్ నుంచి ప్రతీ ఏడాది ఓ సినిమా వస్తుందని అన్నాడు. ఈ  సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి సుమారు 20 కథలు రెడీగా ఉన్నాయని ఆయన ఇప్పటికే చెప్పారు. 

దీంతో ప్రేక్షకులు ప్రశాంత్‌వర్మ తర్వాతి ప్రాజెక్ట్‌ల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా ఈ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా 'దేవకీ నందన వాసుదేవ' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. 

Also Read: అలా చేయొద్దు నాన్న.. అన్నందుకే కూతురిని కడ తేర్చిన తండ్రి!

33 కథలు రాసుకున్నా..

ఈ సినిమాకు ప్రశాంత్ వర్మే కథ అందించాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో  ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.." నేను సినిమాలు మొదలుపెట్టేముందే 33 కథలు రాసుకున్నాను. ఇప్పటివరకు తీసిన సినిమాలు ఆ 33 కథల్లో లేవు, మళ్ళీ అవి వేరే కథలు. నాకు కథలు రాయడం అంటే ఇష్టం. 

Also Read: అయ్యో పాపం.. ట్రాక్టర్‌లో ఇరుక్కొని రైతు మృతి

నాకు ఏ డైరెక్టర్స్ అయినా ఛాన్స్ ఇస్తే హ్యాపీగా డైరెక్షన్ ఆపేసి కథలు రాసుకుంటూ కూర్చుంటాను. ఏ డైరెక్టర్ అడిగినా కథలు ఇస్తాను, బోయపాటి గారు అడిగినా కూడా ఇస్తాను.." అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా 'దేవకీ నందన వాసుదేవ' సినిమాకు అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 22న ఈ మూవీ థియేటర్స్ లో  రిలీజ్ కానుంది.

Also Read: తిరుపతి ముంతాజ్ హోటల్స్‌ను రద్దు చేస్తారా? టీటీడీ ఛైర్మన్ ఏమన్నారు?

Also Read: నరేందర్ రెడ్డిని అలా ఎలా అరెస్ట్ చేస్తారు? పోలీసులకు హైకోర్టు షాక్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు