సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'విశ్వం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? గోపీచంద్ 'విశ్వం' మూవీ ఓటీటీలో ప్రత్యక్షం అయింది. దీపావళి కానుకగా ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. అర్థరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రావడం గమనార్హం. By Anil Kumar 01 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి మ్యాచో స్టార్ గోపిచంద్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'విశ్వం. శ్రీనువైట్ల లాంగ్ గ్యాప్ తర్వాత తీసిన సినిమా కావడంతో ఈ చిత్రంపై ఆడియన్స్ లో భారీ హైప్ నెలకొంది. అక్టోబర్ 11 న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. కామెడీ కొంతవరకు వర్కౌట్ అయినా కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేక పోవడంతో నిర్మాతలకు నష్టాలు తప్పలేదు. The comedy-filled, action-packed journey of #Viswam now streaming on @PrimeVideoIN -https://t.co/fk07jAatsT ❤️🔥💥Watch this perfect entertainer with your family and friends and dive into an blockbuster experience 🤩🤩Macho star @YoursGopichand @SreenuVaitla @KavyaThapar… pic.twitter.com/m0aoVgN0NT — People Media Factory (@peoplemediafcy) November 1, 2024 ఇదిలా ఉంటే ఈ సినిమా ఉన్నట్టుండి ఓటీటీలో ప్రత్యక్షం అయింది. 'విశ్వం' దీపావళి కానుకగా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. తాజాగా దీపావళి సందర్భంగా అమెజాన్ ప్రైమ్ 'విశ్వం' సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులో తెచ్చింది. @PrimeVideoIN NEW releases today!1. #ViswamStarring@YoursGopichand & @KavyaThapar Produced by @peoplemediafcy2. #IbbaniTabbidaIleyali Produced by @rakshitshetty for @ParamvahStudios 3. #BlackStarring @JiivaOfficial & @priya_Bshankar Produced by @Potential_st #OTT pic.twitter.com/DpeuPtMTov — M.L.Prabhakaran. (@muniPrabhakaran) October 31, 2024 Also Read : కమల్ హాసన్ రికార్డు బ్రేక్ చేసిన 'అమరన్'.. తొలిరోజే బాక్సాఫీస్ షేక్ సడెన్ ఎంట్రీ.. అయితే ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండా సడెన్ గా ఓటీటీలోకి సినిమాను వదిలారు. థియేటర్స్ లో రిలీజైన కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రావడం గమనార్హం. థియేటర్స్ లో ఈ సినిమాను మిస్ అయ్యి ఉంటే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది చూసేయండి. Telugu film #Viswam (2024) is now streaming on Amazon Prime.In 4K & Dolby Audio. pic.twitter.com/7IaVc5xqDT — OTT Gate (@OTTGate) October 31, 2024 యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. కావ్యా థాపర్ కథానాయికగా నటించగా.. సీనియర్ నటుడు నరేశ్, ప్రగతి, వెన్నెల కిశోర్ తోపాటు షకలక శంకర్, అజయ్ ఘోష్ ఇతర పాత్రల్లో కనిపించారు. Also Read: ఆ ఊరిలో దీపావళి వేడుకలు లేవు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే #gopichands-viswam #gopichand మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి