/rtv/media/media_files/2024/11/01/zVLiF2RwNRVsABVz8nQv.jpg)
కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ నటించిన తాజా చిత్రం 'అమరన్' దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్, అశోక చక్ర గ్రహీత మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు.
తొలి రోజే అన్ని కోట్లా?
సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. నిన్న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ అందుకుంది. తొలిరోజే దేశవ్యాప్తంగా రూ.21 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించి కమల్ హాసన్ 'ఇండియన్ 2' ఓపెనింగ్స్ ను క్రాస్ చేసింది. ఒక్క తమిళనాడులోనే ఏకంగా రూ.15 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం.
SIVA KARTHIKEYAN'S #Amaran — TERRIFIC OPENING in Tamilnadu Box Office 🔥🔥🔥
— AB George (@AbGeorge_) November 1, 2024
Day 1 Gross Collection - 15.75 Crores 🔥🔥🔥
BLOCKBUSTER OPENING, BIGGEST FOR A TIER 2 ACTOR 👏
WELCOME TO BIG LEAGUE SK 💥 pic.twitter.com/BPO5wj2L1n
Also Read: ఆ ఊరిలో దీపావళి వేడుకలు లేవు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే
రీసెంట్ టైమ్స్ లో విజయ్ ది గోట్, రజనీకాంత్ వేట్టయాన్ సినిమాల తర్వాత భారీ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా 'అమరన్' నిలిచింది. ఈ రోజు తమిళనాడులో హాలిడే కావడంతో రెండో రోజు వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Top 5 opening day gross collection of 2024, Tamilnadu Box Office -
— Digi Star (@TheDigiStar) November 1, 2024
1. #TheGOAT - 31 Crores
2. #Vettaiyan- 19.50 Crores
3. #Amaran - 15.75 Crores
4.#Indian2 - 13 Crores
5. #Thangalaan - 12.50 Crores#Amaran ranks 3rd with ₹15.75 Cr! Solo release would've taken it to #2 spot. pic.twitter.com/4TxeWNrAj5
తమిళ వర్షన్‌లో మొదటి రోజు థియేటర్లలో 77.94 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేయగా.. రెండో రోజు మాత్రం దాదాపు 90 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసే ఛాన్స్ ఉంది. కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందించారు.