Ghaati Twitter Review: ఘాటీ ట్విట్టర్ రివ్యూ.. విశ్వరూపం చూపించిన అనుష్క.. కొన్న సీన్లు చూస్తే గూస్‌బంస్సే!

లేడీ క్వీన్ అనుష్క శెట్టి రెండేళ్ల తర్వాత మళ్లీ థియేటర్‌లోకి ప్రేక్షకులను అలరించింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఘాటీ సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అనుష్క శెట్టి ముఖ్య పాత్రలో నటించిన ఈ మూవీ ఎలా ఉందో ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం. 

New Update
Ghaati

Ghaati

లేడీ క్వీన్ అనుష్క శెట్టి రెండేళ్ల తర్వాత మళ్లీ థియేటర్‌లోకి ప్రేక్షకులను అలరించింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఘాటీ సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్ షోలు పడటంతో సినిమా ఎలా ఉందనే టాక్ వచ్చేసింది. మరి అనుష్క శెట్టి ముఖ్య పాత్రలో నటించిన ఈ మూవీ ఎలా ఉందో ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం. 

ఇది కూడా చూడండి: OG Movie Record: రిలీజ్‌కి ముందే OG రికార్డ్.. వేలంలో ఒక్క టికెట్ ధర రూ.5లక్షలు

అనుష్క యాక్టింగ్ పీక్స్‌లో ఉందని..

ఘాటీ మూవీలో అనుష్క అయితే తన విశ్వరూపం చూపిస్తుందని డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పలు మార్లు తెలిపారు. అయితే క్రిష్ చెప్పినట్లే అనుష్క మూవీలో అయితే తన విశ్వరూపం చూపించిందని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని సీన్లు అయితే సలార్, కేజీఎఫ్ లెవెల్‌లో ఉంటాయని, వాటిని చూస్తే గూస్‌బంప్స్ వస్తున్నాయని నెటిజన్లు అంటున్నారు. అయితే సలార్‌లో కాటేరమ్మ సీన్ టైప్ ఘాటీలో కూడా ఇలాంటి సీన్ ఉంటుందట. ఈ సీన్ మొత్తం సినిమాకి హైలెట్ అని నెటిజన్లు అంటున్నారు. 

మరికొందరు సినిమా సాధారణంగా ఉందని, అనుష్కను ఆ పాత్రలో చూడలేకపోయామని అంటున్నారు. ఇంటర్వెల్ వరకు కూడా సినిమా చూడటం చాలా కష్టమని అంటున్నారు. అనుష్క యాక్టింగ్, సాంగ్స్ బాగున్నాయి. కానీ కొన్ని యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. కొన్నిసార్లు ఈ యాక్షన్ సీన్స్ బోరింగ్‌గా అనిపిస్తాయని నెటిజన్లు అంటున్నారు. 

సినిమా యావరేజ్‌గా ఉందని, మొత్తం సినిమాలో వావ్ మూమెంట్స్ అనేలా సీన్స్ లేవని అంటున్నారు. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ కాస్త బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Mirai Censor: "మిరాయ్" సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే..?

Advertisment
తాజా కథనాలు