ప్రముఖ తెలుగు నటుడు ఫిష్ వెంకట్ (వెంకట్ రాజ్) కిడ్నీ, లివర్ సంబంధిత సమస్యలతో పోరాడుతూ శుక్రవారం (జూలై 18, 2025) 53 ఏళ్ల వయసులో మృతి చెందారు. ఆయన మరణానంతరం కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన భార్య సువర్ణ సినీ పరిశ్రమ నుంచి తగినంత మద్దతు లభించలేదంటూ తమ బాధను వెళ్లగక్కారు. తాజాగా RTV ఛానెల్‌తో మాట్లాడిన ఫిష్ వెంకట్ భార్య సువర్ణ టాలీవుడ్‌పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా
Fish Venkat Wife Fired On Tollywood
సినీ పరిశ్రమ నుంచి తమకు తగినంత మద్దతు లభించలేదంటూ తమ బాధను వెళ్లగక్కారు. తన భర్త ఎన్నో సంవత్సరాలుగా టాలీవుడ్‌లో సేవలందించారని, వందకు పైగా సినిమాలలో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారని గుర్తు చేశారు.
Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?
‘‘ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు పరిశ్రమ నుంచి పెద్దగా స్పందన రాలేదు. కొందరు మాత్రమే చిన్న మొత్తాల్లో సహాయం చేశారు. పవన్ కళ్యాణ్ మాత్రమే తమకు రూ.2లక్షలు ఇచ్చారు తప్ప మాకు ఒక దాతను వెతకడంలో కూడా తగినంత మద్దతు లభించలేదు. ఫిష్ వెంకట్ ఫ్యాన్స్ మాత్రం బాగా హెల్ప్ చేశారు. కానీ టాలీవుడ్ నుంచి ఒక్కరూ కూడా ఎలాంటి సహాయం చేయలేదు. కనీసం ఫోన్ చేసి కూడా పరామర్శించలేదు.’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభాస్ రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారని వచ్చిన వార్తలను ఫిష్ వెంకట్ భార్య సువర్ణ ఖండించారు.
Also Read:ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే
‘‘ఎవరో ప్రభాస్ అసిస్టెంట్‌గా నటించి మాకు ఫోన్ చేశారు. ప్రభాస్ అన్నయ్యకు ఈ విషయం తెలిస్తే తప్పకుండా సహాయం చేస్తారని ఆశించాం. కానీ మాకు ఎలాంటి సహాయం అందలేదు. ఇప్పటికీ ప్రభాస్ నుంచి సహాయం కోసం ఎదురుచూస్తున్నాం. సోనూ సూద్ కూడా ఫోన్లో మాట్లాడారు. ఆయన లక్ష రూపాయలు ఇప్పుడే ఇస్తా అన్నారు. కానీ ఆయన నుంచి కూడా మాకు ఎలాంటి డబ్బులు అందలేదు.’’ అని తెలిపారు.
Also Read:పహల్గాం ఉగ్ర అనుమానితుడు అరెస్టు.. పట్టించిన ఫేసియల్ రికగ్నిషన్