ఈ వారం ఓటీటీలో సినిమాల సందడే.. సందడే.. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ కూడా..

ఈ వారం థియేటర్, ఓటీటీలో బోలెడు సినిమాలు, సీరీస్ లు అలరించనున్నాయి. పెళ్లికాని ప్రసాద్, టుక్‌ టుక్‌, షణ్ముఖ, ది సస్పెక్ట్‌ చిత్రాలు థియేటర్ లో సందడి చేయనుండగా.. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ అనోరా, ఖాకీ: ది బెంగాల్‌ చాప్టర్‌, విమెన్‌ ఆఫ్‌ ది డెడ్‌ 2, ఓటీటీలో రానున్నాయి.

New Update
this week ott release

this week ott release

This Week Ott Movies:  ప్రతీ వారం ఒక కొత్త కంటెంట్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్. ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేయనున్న సినిమాల లిస్ట్ ఏంటో ఇక్కడ తెలుసుకోండి. 

థియేటర్, ఓటీటీ సినిమాలు 

టుక్ టుక్ 

సుప్రీత్ సి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ టుక్ టుక్ మార్చి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, శాన్వీ మేఘన తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

షణ్ముఖ 

హీరో ఆది, అవికా గోర్ జంటగా నటించిన షణ్ముఖ మార్చి 21న విడుదల కానుంది. షణ్ముగం సప్పాని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. 

పెళ్లి కాని ప్రసాద్‌

దిల్ రాజ్ నిర్మాణంలో సప్తగిరి, ప్రియాంక ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'పెళ్లికాని ప్రసాద్'. ఈ చిత్రం మార్చి 21న థియేటర్స్ లో విడుదల కానుంది. 

అనోరా

ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్  'అనోరా' చిత్రం మార్చి 17నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. 2025 ఆస్కార్ వేడుకల్లో ఈ చిత్రం 5 విభాగాల్లో  ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. 

బ్రహ్మా ఆనందం

లెజెండ్రీ కమెడియన్ బ్రహ్మానందం, ఆయన కుమారుడు గౌతమ్ రాజా ప్రధాన పాత్రలో నటించిన  'బ్రహ్మా ఆనందం' చిత్రం మార్చి 20 నుంచి 'ఆహా' లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో బ్రహ్మానందం, ఆయన కొడుకు తాత మనవాళ్లుగా నటించారు.  

నెట్ ఫ్లిక్స్ 

ఖాకీ: ది బెంగాల్‌ చాప్టర్‌ - మార్చి 20 (నెట్ ఫ్లిక్స్) 
ది రెసిడెన్స్‌ (వెబ్‌ సిరీస్‌)- మార్చి 20
విమెన్‌ ఆఫ్‌ ది డెడ్‌ 2 (వెబ్‌ సిరీస్‌) - మార్చి 19
ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ - మార్చి 20
లిటిల్‌ సైబీరియా - మార్చి 21
రివిలేషన్స్‌ - మార్చి 21
బెట్‌ యువర్‌ లైఫ్‌ (వెబ్‌ సిరీస్‌) - మార్చి 20

Also Read: Suma Chaaaat Show: తమన్ చాట్ ఛాలెంజ్.. సుమ కంటెస్ట్ లో విన్ అవ్వడానికి ఇలా చేయండి?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు