Vishwak Sen: హీరో విశ్వక్ ఇంట్లోకి చొరబడిన దొంగలు.. బెడ్ రూమ్ లో..

నటుడు విశ్వక్ సేన్ ఇంట్లో దొంగతనం జరిగినట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారు జామునఇంట్లోని బంగారం చోరీకి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఈ దొంగతనం గురించి ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన‌ట్లు స‌మాచారం.

New Update
Vishwak Sen : సినిమా చూడకుండా ఉదయం ఆరు గంటలకే రివ్యూలు రాశారు.. సినీ క్రిటిక్స్ పై విశ్వక్ సేన్ ఫైర్!

Vishwak Sen: ఫిలింనగర్ రోడ్డు నెంబర్ 8లోని హీరో విశ్వ‌క్‌ సేన్ ఇంట్లోకి దొంగలు చొరబడినట్లు తెలుస్తోంది. విశ్వక్ ఫ్యామిలీ అంతా ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే అతని చెల్లి మన్మయి బెడ్ రూమ్ మూడో అంతస్థులో ఉండగా.. ఆదివారం తెల్లవారుజామున గదిలోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చి గదిలోని అల్మారాలను చెక్ చేయగా బంగారం దొంగతనం జరిగినట్లు తెలిసింది. దీంతో ఆమె విషయాన్ని వెంటనే తండ్రి కరాటే రాజుకు చెప్పగా.. ఆయన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన‌ట్లు స‌మాచారం.

Also Read: Karnataka: రోజుకో రకంగా వాంగ్మూలం..తికమక పెడుతున్న రన్యారావు

2 డైమండ్ రింగులతో సహా.. 

విశ్వక్ తండ్రి కరాటే రాజు ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో అక్కడ వేలి ముద్రలను సేకరించారు. అనంతరం చుట్టు పక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించారు. అయితే తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి బైక్ పై వచ్చినట్లు రికార్డ్ అయ్యింది. ఆ తర్వాత నేరుగా గేటు నుంచి వెళ్లి మూడో అంతస్తులోని మన్మయి బెడ్ రూమ్ లో దొంగతనం చేశాడు. 20 నిమిషాల్లో దొంగతనం పూర్తి చేసి అక్కడి నుంచి పరారైనట్లు గుర్తించారు. రెండు డైమండ్ రింగులు, రూ. 2. 20 లక్షల విలువచేసే బంగారం మాయమైనట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే దొంగ నేరుగా మెయిన్ గెట్ నుంచి ఇంట్లోకి చొరబడడంతో దీనిపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే 20 నిమిషాల్లోనే  దొంగతనం పూర్తి చేసి ఈజీగా వెళ్లిపోవడంతో ఇంటి గురించి బాగా తెలిసినవారే ఈపని చేసినట్లు భావిస్తున్నారు. దీంతో అనుమానితులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.

Also Read:Veera Dheera Soora Teaser: ఉత్కంఠభరితంగా విక్రమ్ 'వీర ధీర శూర' టీజర్.. ఫ్యాన్స్ గెట్​రెడీ..!

Advertisment
తాజా కథనాలు