/rtv/media/media_files/2025/07/06/director-venky-atluri-official-announcement-on-lucky-baskhar-movie-sequel-2025-07-06-15-38-01.jpg)
director venky atluri official announcement on lucky baskhar movie sequel
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) చిత్రం గతేడాది విడుదలై అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రం సీక్వెల్‌కు రంగం సిద్ధం చేసుకుంటోంది. తాజాగా దర్శకుడు వెంకీ అట్లూరి ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) చిత్రానికి సీక్వెల్ ఉంటుందని అధికారికంగా ప్రకటించారు.
Also Read: రోజూ ఆయన కొట్టేవాడు..ఈరోజు నేను కొట్టా..ఒక దెబ్బకే పోయాడు...భార్య సంచలనం
lucky baskhar sequel
తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. ‘లక్కీ భాస్కర్ 2’ చేసే ఆలోచన ప్రస్తుతం ఉందని, తాను ప్రస్తుతం స్క్రిప్ట్‌పై పనిచేస్తున్నానని వెంకీ అట్లూరి తెలిపారు. అయితే దుల్కర్ సల్మాన్, తాను ప్రస్తుతం ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నందున సీక్వెల్ సెట్స్‌పైకి వెళ్లడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. వెంకీ అట్లూరి ప్రస్తుతం సూర్యతో ‘సూర్య 46’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం పూర్తయిన తర్వాత ‘లక్కీ భాస్కర్’ సీక్వెల్‌పై పూర్తి స్థాయిలో దృష్టి సారించే అవకాశం ఉంది.
‘లక్కీ భాస్కర్’ స్టోరీ
‘లక్కీ భాస్కర్’ ఒక సాధారణ బ్యాంక్ క్యాషియర్ అయిన భాస్కర్ జీవితం చుట్టూ తిరుగుతుంది. 80వ దశకం చివర్లో, 90వ దశకం ప్రారంభంలో బాంబేలో రుణాల భారం, అవమానాలతో సతమతమవుతూ.. అదృశ్యమైన డబ్బుతో అతను ఎలా విజయం సాధించాడనేది ప్రధానాంశం. ఈ చిత్రం బలమైన కథాంశం, నటీనటుల అద్భుతమైన నటన, ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
Also Read: పోలీసులనే మోసం చేసిన యువతి.. యూనిఫాంలో ట్రైనింగ్ చేస్తూ
‘లక్కీ భాస్కర్’ సీక్వెల్ ప్రకటన దుల్కర్ సల్మాన్ అభిమానులలో, సినీ ప్రియులలో ఉత్సాహాన్ని నింపింది. ఈ చిత్రం దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవగా.. సీక్వెల్ కూడా అంతే విజయవంతం అవుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సీక్వెల్ కథాంశం, విడుదల తేదీ వంటి మరిన్ని వివరాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.