/rtv/media/media_files/2025/07/12/shankar-dream-project-velpari-2025-07-12-16-59-45.jpg)
Shankar Dream project Velpari
Director Shankar: ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలతో వరుస ప్లాపులు అందుకున్నారు స్టార్ డైరెక్టర్ శంకర్. ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందించకపోయినా.. ఏ మాత్రం నిరాశ చెందకుండా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ తో తిరిగి ఫామ్‌లోకి రావడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి తన డ్రీమ్ ప్రాజెక్టును తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు.
“My first dream was Enthiran… now it’s #Velpari ❤️🔥 This film has the scale and vision to match Game of Thrones or Avatar.
— Kollywood Now (@kollywoodnow) July 11, 2025
With new tech & strong story, it can become a global pride for Tamil cinema✨ Hope this dream comes true!” - Dir #Shankar 🎬🔥 pic.twitter.com/AfMYrRaSS6
Also Read: Superman: 30 సెకన్ల కిస్ సీన్ కట్ .. సెన్సార్ బోర్డు పై హీరోయిన్ ఫైర్!
'వేల్పారి' నవలతో
అయితే తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు శంకర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. "ఒకప్పుడు నా కలల ప్రాజెక్ట్ 'రోబో' .. ఇప్పుడు 'వేల్పారి'" అని ప్రకటించారు. 'వేల్పారి' అనేది సు.వెంకటేశన్ రాసిన ఒక చారిత్రక నవల. లక్షకు పైగా కాపీలు అమ్ముడైన ఈ నవల ఆధారంగానే తన కలల ప్రాజెక్ట్ తెరకెక్కించబోతున్నటు తెలిపారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతుందని.. ఇప్పటివరకు నిర్మించిన చిత్రాలలోకెల్లా ఇది అతి పెద్దది అవుతుందని పేర్కొన్నారు.
అంతేకాకుండా దీనికోసం ఉపయోగించే కాస్ట్యూమ్స్, ఆర్ట్ డిజైన్స్, టెక్నాలజీ భారీ స్థాయిలో ఉంటుందని తెలిపారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' లేదా 'అవతార్' వంటి చిత్రాలకు దీటుగా ఉంటుందని పేర్కొన్నారు. భారీ బడ్జెట్, అత్యాధునిక సాంకేతికతతో ఈ సినిమాను రూపొందించాలని శంకర్ యోచిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు ఏ హీరో నటిస్తారు, ఏ బ్యానర్‌లో తెరకెక్కుతుంది అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 'వేల్పారి' నవల.. ఒక పౌరాణిక పాలకుడైన వేల్ పారి ముగ్గురు శక్తివంతమైన రాజవంశాలైన చేర, చోళ, పాండ్య రాజుల నుంచి ఎదుర్కొన్న ప్రతిఘటన చుట్టూ తిరుగుతుంది.
Also Read:Shilpa Shetty: అబ్బా! గ్రీన్ శారీలో ఫిదా చేస్తున్న శిల్పా.. ఫొటోలు చూస్తే చూపు తిప్పుకోలేరు!