Superman: 30 సెకన్ల కిస్ సీన్ కట్ .. సెన్సార్‌ బోర్డు పై హీరోయిన్ ఫైర్!

బాలీవుడ్ నటి నటి శ్రేయా ధన్వంతరి  నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ  'సూపర్ మ్యాన్' ఇండియన్ వెర్షన్ లో 30 సెకండ్ల కిస్ సీన్ తొలగించడంపై సెన్సార్ బోర్డు పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

New Update

Superman:  బాలీవుడ్ నటి నటి శ్రేయా ధన్వంతరి  నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ  'సూపర్ మ్యాన్' ఇండియన్ వెర్షన్ లో 30 సెకండ్ల కిస్ సీన్ తొలగించడంపై సెన్సార్ బోర్డు పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేయడం 'పూర్తి అసంబద్ధం' అని విమర్శించారు. ఈ మేరకు తన ఇన్ స్టాగ్రామ్ ఒక సుదీర్ఘ పోస్ట్ షేర్ చేసింది.   "థియేటర్‌కు వెళ్లే అనుభవాన్ని ఎందుకు ఇంత దారుణంగా మారుస్తున్నారు? మనం ఏమి చూడాలనుకుంటున్నామో మనమే నిర్ణయించుకోవాలి కదా!" అని ప్రశ్నించారు.

Also Read:Shilpa Shetty: అబ్బా! గ్రీన్ శారీలో ఫిదా చేస్తున్న శిల్పా.. ఫొటోలు చూస్తే చూపు తిప్పుకోలేరు!

చిన్న పిల్లలను చేయకండి!

''మనం థియేటర్‌లకు వెళ్లాలని , పైరసీని ఆపాలని కోరుకుంటారు. కానీ,  మీరు మాత్రం థియేటర్ అనుభవాన్ని ఇంత భయంకరంగా ఎందుకు చేస్తున్నారు? మా డబ్బు, మా సమాయంతో మేం ఏం చూడాలో మమల్నే నిర్ణయించుకోనివ్వండి. ఇదొక హాస్యాస్పదమైన చర్య! సినిమా చూడడానికి థియేటర్ ఒక ఉత్తమమైన మార్గం. కానీ సెన్సార్ బోర్డు ప్రేక్షకులను చిన్న పిల్లలుగా భావించి.. థియేటర్‌ అనుభూతిని పూర్తిగా ఆస్వాదించకుండా చేస్తోంది'' అంటూ విమర్శించింది. 

Shreya Dhanwanthary
Shreya Dhanwanthary

33 సెకన్ల ముద్దు సీన్

పలు బాలీవుడ్ నివేదికల ప్రకారం.. 'సూపర్ మ్యాన్' సినిమాలో నటీనటులు  వాడిన బూతులను తీసివెలయాని సెన్సార్ బోర్డు నిర్మాణ సంస్థకు ఆదేశించింది. అలాగే 8 సెకన్ల పాటు ఉన్న ఒక అసభ్యకరమైన చేతి సంజ్ఞ, హీరోహీరోయిన్ల మధ్య 33 సెకన్ల రొమాంటిక్ ముద్దు సీన్ ని కూడా తొలగించాలని తెలిపింది. 

ఇదిలా ఉంటే నటి శ్రేయ ధన్వంతరి మనోజ్ బాజ్‌పాయ్  'ఫ్యామిలీ మ్యాన్' , స్కాం వంటి వంటి వెబ్ సీరీస్ లలో నటించింది. అలాగే  'లూప్ లపేట', 'చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్', 'ముంబై డైరీస్ 26/11'  సినిమాల్లో నటించింది. 

Also Read: Superman Trailer: పదేళ్ళ తర్వాత మళ్లీ రాబోతున్న 'సూపర్‌మ్యాన్' .. ట్రైలర్ భలే ఉంది!

Advertisment
Advertisment
తాజా కథనాలు